కొత్తపాలెం - సాలెంపాలెం రోడ్డు నిర్మించాలని టీడీపీ, జనసేన నాయకులు నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 1:40 PM IST
Accidents in Kothapalem to Salempalem Road : కృష్ణాజిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు నిరసనలు చేపట్టారు. కోడూరు మండలం కొత్తపాలెం నుంచి సాలెంపాలెం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో నిత్యం ఈ రోడ్డు పై పలు ప్రమాదాలు జరుగుతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పై ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి వెళ్తామనే నమ్మకం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.
Accidents Happen Formation of Huge Potholes: కొత్తపాలెం నుంచి సాలెంపాలెం వరకు ఉన్న రోడ్డు పై ఎక్కువగా భారీ వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ వాహనాల్లో అక్రమంగా మట్టి రవాణ చేయడం వల్ల ఈ రహదారి పూర్తిగా ధ్వంసం అవుతుందని టీడీపీ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ గుంతలు ఏర్పడటం వల్ల వారం రోజుల క్రితం స్కూల్ బస్సు అదుపు తప్పి కాలువలో పడిందని మండిపడ్డారు. అదృష్టవశాత్తు కాలువలో నీరు లేకపోవడం వల్ల బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్ధులకు ప్రమాదం తప్పిందన్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయన్నారు. స్థానిక ఎమ్యెల్యే గత మూడు సంవత్సరాలుగా రోడ్డు వేస్తాం అని చెబుతున్నారు.... కానీ ఇంత వరకు ఎటువంటి ప్రక్రియ చేపట్టలేదన్నారు. ఈ రోడ్డు పై నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేసారు. అవనిగడ్డ - కోడూరు రోడ్డు నిర్మాణం చేపడతామని స్వయంగా ముఖ్యమంతి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.