'మాజీ మంత్రి కన్నబాబు సోదరుడు వేధింపులు తట్టుకోలేకనే వైద్యుడు ఆత్మహత్య' - అచ్చెన్నాయుడు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 5:53 PM IST
Acchennayudu Comments On Doctor Suicide In Vijaywada : కాకినాడలో యువ వైద్యుడు శివ కిరణ్ చౌదరి ఆత్మహత్యకు ముఖ్యమంత్రిదే బాధ్యత అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కన్నబాబు సోదరుడు, అతని అనుచరుల వేధింపులు తట్టుకోలేకనే వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. కుమారుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేసిన తల్లినీ వైసీపీ రౌడీలు వేధిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై విచారణ జరిపించి... శివ కిరణ్‌ను పొట్టన పెట్టుకున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
TDP Leader Acchennayudu On YSRCP Government : అధికార పార్టీ అండతోనే కొందరు వైసీపీ మద్దతు దారులు డాక్టర్ ఆత్మహత్యకు కారణమయ్యారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇప్పుడు కేసు పెట్టిన కారణంగా వైద్యుడి తల్లిని బెదిరిస్తున్నారని తమ వైఖరి మార్చుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైద్యుడి మరణం పట్ల సానుభూతి ప్రకటించారు.