మధ్యాహ్న భోజనంలో బల్లి - 51మంది విద్యార్థులకు అస్వస్థత
🎬 Watch Now: Feature Video
51 Students Getting Ill After Eating Lizard Food in School: అన్నమయ్య జిల్లా టేకులపాలెం పాఠశాలలో బల్లి పడిన ఆహారం తిని 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బల్లిపడిన ఆహారం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకోవటంతో హుటాహుటిన వారందరిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
Students Vomit after Eating Food at School: అన్నమయ్య జిల్లా ఎంపీయూపీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రోజులాగే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. భోజనంగా వెజిటెబుల్ రైస్ వడ్డించారు. ఈ భోజనం తిన్న అనంతరం 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 25 మంది బాలికలు సహా 51 మంది విద్యార్థులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమమైన పాఠశాల సిబ్బంది మదనపల్లి ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. విద్యార్థులకు సెలైన్ బాటిల్ పెట్టి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని ఎటువంటి సమస్య లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై స్పందించిన ఎంఈవో రాజేంద్రప్రసాద్ ఉన్నతాధికారులకు సమాచారం అందించి విచారణ చేపట్టామన్నారు. మదనపల్లె ఆర్డీవో మురుళి విద్యార్థులను పరామర్శించారు.విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆర్డీవో సూచించారు.