12 Feet King Cobra Snake Hulchul: అమ్మో.. 12 అడుగుల కింగ్ కోబ్రా... హడలెత్తిపోయిన స్థానికులు - అనకాపల్లి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-10-2023/640-480-19773048-thumbnail-16x9-snake.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2023, 4:09 PM IST
12 Feet King Cobra Snake Hulchul: మామూలుగా పామును చూస్తే చాలు.. పారిపోతాం. అదే 12 అడుగుల పొడవైన గిరి నాగు కళ్లముందు బుసలు కొడుతూ కనిపిస్తే..? ఊహించడానికే భయంగా ఉంది కదూ..! అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే ఆ పాము పాఠశాల మరుగుదొడ్లోకి వచ్చి చేరింది. చివరికి దానిని పట్టుకుని తిరిగి క్షేమంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది.. వివరాలివీ..
వైల్డ్ లైఫ్ సిబ్బంది సహకారంతో.. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం లక్ష్మీదేవి పేటలో పొడవైన పాము హల్చల్ చేసింది. దాదాపు 12 అడుగులు ఉన్న ఈ గిరినాగు.. అటవీ ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి వచ్చింది. స్థానిక పాఠశాల మరుగుదొడ్డిలో పాము చొరబడి బుసలు కొట్టింది. దీంతో భయాందోళన చెందిన స్థానికులు 'వైల్డ్ లైఫ్ సొసైటీ' వారికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును సమీపంలోని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.