10 feet Snake in a House at Rampachodavaram: ఇంట్లో 10 అడుగుల పాము హల్చల్.. చాకచక్యంగా పట్టుకున్న జంతు ప్రేమికుడు - 10 Feet Snake Hulchul in House at Rampachodavaram
🎬 Watch Now: Feature Video

10 Feet Snake Hulchul in a House at Rampachodavaram: రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో విషసర్పాలు, పురుగులు, జెర్రెలు వంటి విషకీటకాలు ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురువుతున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని రంపచోడవరంలో శివాలయం వీధిలోని ఓ ఇంట్లోకి 10 అడుగుల పొడవున్న పాము ప్రవేశించింది. దీంతో నివాసితులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. వెంటనే వారు జంతు సంరక్షణ ప్రేమికుడికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జంతు ప్రేమికుడు బాలాజీ చాకచక్యంగా విషసర్పాన్ని పట్టుకున్నాడు. అనంతరం అతడు పామును సమీపంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇటీవలే అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలో ఓ బైక్ సీటు కింద పాము హల్చల్ సృష్టించింది. దీంతో ఆ ప్రాంతంలో స్థానికులు భయంతో వణికిపోయారు. సుమారు పది గంటలపాటు ఆ పామును బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.