రాజమహేంద్రవరంలో నిధి అగర్వాల్ సందడి.. - రాజమహేంద్రవరంలో నిధి అగర్వాల్ సందడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 18, 2019, 6:54 PM IST

రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్​లో  బీఆర్​కే షాపింగ్​మాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సినీనటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై షాపింగ్ మాల్​ను ప్రారంభించారు. ఈ వయ్యారి భామను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానుల కోరిక మేరకు నిధి సినిమా పాటలకు డాన్స్ చేశారు. ఈ అందాల తారతో సెల్ఫీలు  తీసుకునేందకు అభిమానులు పోటీపడ్డారు. రాజమహేంద్రవరానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ...  ముద్దుగుమ్మ మురిసిపోయింది. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన భరత్ రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ఆదిరెడ్డి భవాని తదితరులు హాజరయ్యారు. బీఆర్​కే షాపింగ్​మాల్ యజమాని బొమ్మన రాజ్​కుమార్ దంపతులను నాయకులు సన్మానించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.