పుష్పకవిమాన వాహనంలో శ్రీవారు - Brahmotsav of Sri Srinivasa in thirumala latest

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 22, 2020, 2:01 PM IST

అచ్యుతా, మాధవ, గోవింద, గోపాల, గోవర్ధన గిరిధార...ఇలా ఏన్నో పేర్లతో ముద్దుగా పిలుచుకోనే కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పుష్పక విమాన వాహన సేవను నిర్వహించారు. శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో రుక్మిణి స‌త్యభామ స‌మేత గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో... మ‌ల‌య‌ప్ప స్వామివారు ‌పుష్పక విమానంలో అభ‌య‌మిచ్చారు. మూడేళ్లకోసారి నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే ఈ ప్రత్యేక వాహన సేవను నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో సేవ నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ ప్రత్యేకమైన విమానం కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. 15 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పుతో 750 కేజిల బ‌రువుతో తయారు చేశారు. ఇందులో 150 కేజిల మల్లి, క‌న‌కాంబ‌రం, మొల్లలు, వృక్షి, చామంతి, లిల్లి, తామరపూలు, రోజాలు తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు ఉప‌యోగించారు. మూడు ద‌శ‌ల‌లో ఏర్పాటు చేసిన ఈ వాహనంలో ఇరువైపులా ఆంజ‌నేయ‌స్వామి, గ‌రుడ‌ళ్వార్‌ న‌మ‌స్కరిస్తున్నట్లుగా, మొద‌టి ద‌శ‌లో అష్టలక్ష్ములు, రెండ‌వ ద‌శ‌లో ఏనుగులు, చిల‌క‌లు, మూడ‌వ ద‌శ‌లో నాగ ప‌డ‌గ‌ల ప్రతిమ‌ల‌తో సుందరంగా రూపొందించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.