దేశీ చైనీస్ పేరుతో నోవాటెల్ హోటల్లో నోరూరిస్తున్న వంటకాలు - విజయవాడలో నోవాటెల్ హోటల్ వార్తలు
🎬 Watch Now: Feature Video
బెజవాడ వాసులతో పాటు భోజన ప్రియులను అలరించేందుకు నగరంలోని నోవాటెల్ హోటల్లో చైనీస్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. దేశీ చైనీస్ పేరుతో... హోటల్ లోని వూగన్ రెస్టారెంట్ లో సంప్రదాయ చైనీస్ వంటకాలను అందించనున్నారు. దేశీ రుచులతో కలిపి చైనీస్ వంటకాలను నగర వాసులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 6 నుంచి 15 వరకు 10 రోజుల పాటు ఈ చైనీస్ ఫెస్టివల్ భోజన ప్రియులకు అందుబాటులో ఉండనుంది. హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో తయారు చేసిన గుంటూరు చిల్లీ మంచూరియన్, కరివేపాకు పనీర్ సాతే, చికెన్ టిక్కా ఫ్రైడ్ రైస్, టోఫు పులావ్, టెపన్యాకి తందూరి....ఇలా నోరూరించే దేశీ చైనీస్ వంటకాలు నగర వాసులను రారమ్మంటున్నాయి