అడవి పందులను తప్పించుకోబోయి.. రిజర్వాయర్‌లోకి దూకిన ఆవులు.. ఆ తర్వాత - ap latest news
🎬 Watch Now: Feature Video
COWS: నంద్యాల జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ఆవుల మంద దూకింది. అడవి పందులు తరమడంతో.. ప్రాణభయంతో తెలుగు గంగ రిజర్వాయర్‌లోకి దూకాయి. ఇది గమనించిన పశువుల కాపర్లు ఆందోళన చెందారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లకు సమాచారమిచ్చారు. సుమారు 500 ఆవులు ఉన్నట్లు కాపర్లు తెలిపారు. జాలర్లు బోట్ల సహాయంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. దీంతో పశువుల కాపర్లు ఊపిరి పీల్చుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST