ETV Bharat / sukhibhava

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇలా చేస్తే ముఖం ఎంతో తాజాగా ఉంటుంది! - చలికాలంలో స్కిన్​ డ్రై అవుతోందా

Winter Skin Care Tips in Telugu: చలికాలంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్య చర్మం పొడిబారడం. దీని కారణంగా.. బయటికి వెళ్లాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటారు. మరి ఈ ప్రాబ్ల్మ్​కు ఎలా చెక్ పెట్టాలో మీకు తెలుసా?

Winter Skincare Tips
Winter Skincare Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 12:50 PM IST

Winter Skin Care Tips in Telugu: చలి ప్రతాపం చూపిస్తోంది. ఈ శీతాకాలంలో జనాలు ఎదుర్కొనే ఇబ్బందుల్లో చర్మం పొడిబారడం ఒకటి! దీనివల్ల స్కిన్ పాలిపోయినట్టుగా ఉంటుంది. సరైన చర్యలు తీసుకోకపోతే కఠినమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో చల్లని గాలుల నుంచి చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలంటే.. సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

క్లెన్సర్
క్లెన్సర్

హైడ్రేటింగ్ క్లెన్సర్: క్లెన్సర్ ద్వారా చర్మం పొడిబారకుండా రక్షించుకోవచ్చు. అయితే.. సరైన క్లెన్సర్ ఎంచుకోవడం ముఖ్యం. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, సిరామైడ్ వంటి పదార్థాలు ఉన్న వాటిని ఎంచుకోవడం ఉత్తమం. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. కఠినమైన రసాయనాలు కలిగిన సబ్బులు, ఆల్కహాల్ ఆధారిత క్లెన్సర్ లు ఉపయోగించడం మానుకోవాలి. ఇవి చర్మ స్థితిని మరింత దిగజారుస్తాయి. చర్మంలోని నేచురల్ ఆయిల్స్ తొలగిపోకుండా చూసే వాటిని.. హైడ్రేటింగ్ గా ఉండే క్లెన్సర్స్​ను ట్రై చేయాలి.

మీ ఫేస్ గ్లాస్​ స్కిన్‌లా మెరవాలా?- ఈ రెండు ఐటెమ్స్​ ఉంటే చాలు, గ్లో అదిరిపోద్ది!

మాయిశ్చరైజర్​: చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. తేమ చాలా ముఖ్యం. ఇందుకోసం మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది. ఇది.. చర్మం తేమను కోల్పోకుండా నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. ఇంకా.. పొడి వాతావరణంలో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. మార్కెట్లో లభించే ఏదో ఒకటి కాకుండా.. తేమను లాక్ చేసే క్రీమ్​ను ఎంచుకోవాలి.

ఉల్లిపాయలు ఇలా తీసుకుంటే- డయాబెటిస్​కు చెక్​!

ఎక్స్ ఫోలియేటర్స్: చర్మం పొడిబారితే.. పొరలు పొరలుగా లేస్తుంది. మృతకణాలతో ముఖం నిర్జీవంగా మారుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు.. ఎక్స్ ఫోలియేటర్స్​ను ఉపయోగించాలి. చర్మం, పెదాలపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి.. చలికాలంలో చర్మాన్ని తాజాగా ఉంచడంలో ఇవి ఎంతో సహకరిస్తాయి. లాక్టిక్ యాసిడ్ లేదా ఫ్రూట్ ఎంజైమ్స్ కలిగిన పదార్థాలు ఉన్న ఎక్స్ ఫోలియేట్స్​ను ఎంచుకోవాలి. ఇవి ఎఫెక్టివ్​గా పని చేస్తాయి. పగిలిన చర్మపు చికాకు నుంచి విముక్తి కలిగిస్తాయి.

సన్ స్క్రీన్
సన్ స్క్రీన్

సన్ స్క్రీన్ : శీతాకాలంలో సూర్యుడి ప్రభావం తక్కువ అనుకుంటారు అందరూ! కానీ.. చర్మం విషయంలో ఆ ఎఫెక్ట్ తక్కువేం కాదు! అనుకున్న దానికంటే ఎక్కువగానే సూర్యకిరణాలు ముఖానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి.. స్కిన్ డ్యామేజ్​ నుంచి బయట పడేందుకు తప్పనిసరిగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎండ ఎక్కువగా తగిలే మొహం, మెడ, చేతులు, పాదాలకు సన్ స్క్రీన్ రాసుకోవాలి. SPF 30 ఉన్న సన్ స్క్రీన్ రాసుకుంటే మంచిది. ఇది హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. రోజుకి కనీసం రెండు నుంచి మూడు సార్లు రాసుకోవచ్చు. ఎక్కువ సేపు ఆరుబయట ఉండేవాళ్లు దీన్ని తప్పనిసరిగా రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హ్యూమిడిఫయర్
హ్యూమిడిఫయర్

హ్యూమిడిఫయర్లు: హ్యూమిడిఫయర్ ముఖానికి ఆవిరిపట్టే చిన్న మిషన్. గదిలో వాతావరణాన్ని బ్యాలెన్స్ చేసేందుకు కూడా ఇవి లభిస్తాయి. వీటిని గదిలో ఉంచితే.. రూమ్ టెంపరేచర్​ చక్కగా ఉంటుంది. చర్మానికి ఆవిరి పట్టుకోవడం ద్వారా.. నిర్జీవం కాకుండా కాపాడుతుంది.

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!

తలనొప్పి తగ్గడం లేదా? ఈ టీ లు ట్రై చేస్తే చిటికెలో మాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.