ETV Bharat / sukhibhava

మొటిమల సమస్య - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్​కు వెళ్లాలి! - మొటిమల సమస్యకు ట్రీట్‌మెంట్‌

When Should Take Medical Treatment For Pimples : టీనేజ్‌లో చాలా మంది యువతీ యువకులను వేధించే సమస్య మొటిమలు ఒకటి. కొందరిలో ఇదొక సాధారణ సమస్యగా ఉంటే.. మరికొందరిలో చాలా తీవ్రమైన ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు డాక్టర్​ను ఎప్పుడు సంప్రదించాలి? అసలు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

Symptoms For Medical Treatment For Acne And Pimples

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 10:19 AM IST

When Should Take Medical Treatment For Pimples : యుక్త వయస్సులో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలను మొటిమల సమస్య వేధిస్తుంటుంది. సాధారణంగా శరీరంలోని వేడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, కాలుష్యం వంటి.. వివిధ కారణాల వల్ల మొటిమలు వస్తుంటాయి. వీటి వల్ల ఏర్పడే మచ్చలు, ఎర్రటి మొటిమలు ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి. చర్మ ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. అయితే, ఈ మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. మరి.. ఆ లక్షణాలు ఏంటి? సమస్య తీవ్రం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మొటిమలు రాకుండా ఏ ఆహారం తీసుకోవాలి..?

  • ఓమేగా-3 ఫ్యాటీ అమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు, ఆకుకూరలు, వాల్‌నట్స్‌, ఆలివ్‌నూనె, బీన్స్‌, గుడ్లు, అవిసె గింజలు తీసుకోవాలి.
  • మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నవారు రోజు రెండు కప్పుల గ్రీన్‌ టీ తీసుకుంటే మంచిది.
  • గ్రీన్‌ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు.. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, మొటిమల సమస్యను త్వరగా దూరం చేస్తాయి.
  • టమాటాల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మ సమస్యలను తగ్గిస్తుంది. వీటిని వంటల్లో ఎక్కువగా వాడడం వల్ల మొటిమల సమస్య నుంచి సులభంగా గట్టెక్కవచ్చని నిపుణులు అంటున్నారు. టమాటా సూప్‌ తాగినా లాభం ఉంటుంది.
  • మొటిమల సమస్యతో విసిగిపోతున్న వారు రోజూ 8 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
  • రోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్లు కూడా తాగాలని సూచిస్తున్నారు.
  • విటమిన్ ఇ ఎక్కువగా ఉండే.. నట్స్, గుడ్లు, తాజా పండ్లను రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

చలికాలంలో ఇంట్లోనే ఈజీగా వర్కవుట్స్- ఈ టిప్స్ మీకోసమే!

ఇవి తినొద్దు!

  • మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. చక్కెర శాతం ఎక్కువా ఉంటే కూడా.. మొటిమలు సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి..

  • మొటిమల సమస్యతో బాధపడుతున్న వారు.. కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు.
  • మొటిమలను తగ్గించుకోవడానికి అన్ని సహజ పద్ధతులను పాటించినా కూడా.. తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • మొటిమలు ఎర్రగా మారి, వాపు వచ్చినట్లుగా, నొప్పిగా అనిపిస్తే కూడా వైద్యుడిని సంప్రదించాలి.
  • కొందరిలో ముఖం నిండా మొటిమలు ఎక్కువై చీము పడుతుంటాయి. ఇలాంటి వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • వైద్యులను సంప్రదించడం ద్వారా.. వారు ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని అంటున్నారు.

పడక గదిని నిశ్శబ్ధం ఆవహిస్తోందా? - ఇవి ట్రై చేస్తే మీకు తిరుగుండదు!

పెసర పప్పు, ఎర్ర పప్పు - ఈ రెండిటిలో షుగర్ పేషెంట్స్​ ఏది తినాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.