ETV Bharat / sukhibhava

రోజూ ఈ వ్యాయామాలు చేస్తే - మీ బ్రెయిన్ పవర్ ఓ రేంజ్​లో పెరుగుతుంది! - Brain Power Increase Exercises

Best Exercises for Improve Brain Power : మీరు రోజూ శారీరక వ్యాయామాలు చేస్తుంటారా? అయితే వాటితో పాటు కొన్ని మానసిక వ్యాయామాలలో కూడా పాల్గొనాలని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. నిపుణులు. అప్పుడే మీ మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందంటున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం..

Brain
Brain
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 3:00 PM IST

Brain Power Increase Effective Exercises : ప్రస్తుత రోజుల్లో దీర్ఘకాలికంగా ఉంటున్న ఒత్తిళ్లు, నిరంతరమైన ఆందోళనల కారణంగా మెదడుపై విపరీతమైన భారం పడి.. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా.. ఫిట్​గా​ ఉండడానికి రోజూ ఏ విధంగానైతే వ్యాయామాలు(Exercises) చేస్తున్నారో.. మానసికంగా హెల్దీగా ఉండాలన్నా కొన్ని వ్యాయమాలు తప్పనిసరి అని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పుడే మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు వృద్ధాప్యంలో లేదా శరీరం బలహీనంగా ఉన్న టైమ్​లో కూడా ఎవరిపై ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకొనే తెలివి ఉంటుందట. ముఖ్యంగా ఈ మానసిక వ్యాయామాలలో పాల్గొనడం ద్వారా మీ మెదడు పనితీరు మెరుగుపడడమే కాదు.. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తెలివితేటలు, సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యాయామాలేంటో ఇప్పుడు చూద్దాం..

ధ్యానం : మీ బ్రెయిన్ పవర్ పెంచుకోవడంలో ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డైలీ మెడిటేషన్ చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, నిరాశ అనేవి తగ్గుతాయి. అప్పుడు మీ నాడీ మార్గాలు చురుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా మీ దృష్టి, పరిశీలనా నైపుణ్యాలు మెరుగుపడడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

నాన్ డామినెంట్ హ్యాండ్ ఉపయోగించడం : మీ మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి మరో బెస్ట్ ఎక్సర్​సైజ్.. నాన్ డామినెంట్ హ్యాండ్ ఉపయోగించడం. అంటే మీరు రోజూ ఎక్కువగా ఉపయోగించే హ్యాండ్ కాకుండా మరో హ్యాండ్ యూజ్ చేయడం. ఇది మెదడుకు ఉత్తమమైన వ్యాయమాలలో ఒకటని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు మీరు ఎక్కువగా ఉపయోగించే హస్తం కుడి చేయి అయితే.. ఇప్పుడు మీ ఎడమ చేతితో బ్రష్ చేయడం, తినడం, రాయడం.. లాంటి రోజువారీ పనులను చేయడానికి ప్రయత్నించాలి. సాధారణంగా మీరు ఒకే హ్యాండ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు మెదడులోని ఒక అర్ధగోళం మాత్రమే చురుకుగా ఉంటుందని.. అదే మీరు నాన్ డామినెంట్ హ్యాండ్​ను కూడా ఉపయోగిస్తున్నట్లయితే మెదడు రెండు అర్ధగోళాలు చురుకుగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా మీలో విభిన్నంగా ఆలోచించే ధోరణి, సృజనాత్మకత పెరుగుతుంది.

బోర్డ్ గేమ్స్​ ఆడటం : ఈ బోర్డ్ గేమ్స్ ఆడటం అనేది మీ మెదడు చురుగ్గా పని చేయడానికి తోడ్పడే అత్యంత సృజనాత్మక, ఆహ్లాదకరమైన మార్గాలలో ఒకటి. ఇది మీ దృష్టి, అవగాహాన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి ఈ గేమ్స్ చాలా బాగా సహాయపడతాయి. ఉదాహరణకు చెస్, సుడోకు, పదివినోదం, క్రాస్ వర్డ్స్ పజిల్స్ వంటి బోర్ట్ గేమ్స్​తో పాటు మరికొన్ని మెదడుకు పదునుపెట్టే గేమ్స్ ఆడటం వల్ల మెదడు పనితీరు మెరుగవ్వడంతో పాటు జ్ఞాపకశక్తి రెట్టింపవుతుంది.

పుస్తకాలు చదవడం : మీ మెదడుకు మరో గొప్ప వ్యాయామం పుస్తకాలు చదవడం. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా, చదవడం వల్ల మీ మెదడు.. పరిస్థితిని, సన్నివేశంలోని పాత్రలను పుస్తకంలో రాసిన డైలాగ్‌లు వారి స్వరాలలో ఎలా వినిపిస్తాయో విజువలైజ్ చేయడానికి అనుమతిస్తుంది. క్రమం తప్పకుండా చదవడం వల్ల మీ పదజాలం మెరుగుపడుతుంది. నాణ్యమైన నిద్ర వస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. అలాగే వయస్సుతో పాటు మానసిక క్షీణతను నిరోధించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. ఇక మీరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్న వారైతే.. ఎప్పుడూ రొటీన్ పుస్తకాలు కాకుండా కొత్తవాటిని చదవడానికి ట్రై చేయండి. ఈ మార్పు ఇతర విషయాలకు కనెక్ట్ అయ్యేలా మీ మెదడు పని చేస్తుంది.

ఆఫీస్​ టెన్షన్స్​ ఎక్కువ అయ్యాయా.. ఈ 5 సింపుల్ ఆసనాలతో రిలీఫ్

​సంగీతం వినండి : మీ మెదడు పనితీరుపై సంగీతం వినడం కూడా భారీ సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సంగీతం వినడం మీ అభిజ్ఞా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు మెదడులోని వివిధ భాగాలను కనెక్ట్ చేయడంలో ఎంతో సహాయపడుతుందని మల్టీడిసిప్లినరీ డిజిటల్ పబ్లిషింగ్ ఇన్‌స్టిట్యూట్(MDPI) వారు చెప్పారు. అధ్యయనాల ప్రకారం.. ఆనందకరమైన సంగీతాన్ని వినడం వలన వినూత్న ఆలోచనలు రావడంతో పాటు మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అదే విధంగా ఆందోళన, నిరాశను తగ్గించడంలో సంగీతం కూడా చాలా బాగా సహాయపడుతుంది.

కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి : ఇది మెదడును వివిధ మార్గాల్లో నిమగ్నం చేయడంలో సహాయపడడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే మధ్య, చివరి యుక్త వయసు దశలో మేధోపరమైన, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులు.. తోటివారితో పోల్చితే మెరుగైన అభిజ్ఞా విధులను కలిగి ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. అదేవిధంగా వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ.

సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం : చురుకుగా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు మెరుగైన అభిజ్ఞా విధులను కలిగి ఉంటారు. అలాగే వారి మెదడు ఉత్తేజితమవుతుంది. డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధితో బాధపడే అవకాశం తక్కువ. ఉదాహరణకు పుస్తకాల క్లబ్‌లో చేరడం లేదా పార్క్‌లో నడవడానికి ఒక సమూహాన్ని ఏర్పాటు చేయడం పెద్దలు సామాజికంగా చురుకుగా ఉండటానికి కొన్ని మార్గాలుగా చెప్పుకోవచ్చు. ఇలా మేము చెప్పిన ఈ వ్యాయామాలకు తరచుగా కొంత సమయం కేటాయించి ఫాలో అయ్యారంటే మీ మెదడు పనితీరు మెరుగుపడడమే కాదు.. మీ జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - మీకు "బ్రెయిన్​ ఫాగ్"​ ఉన్నట్టే!

అలర్ట్ - రాత్రివేళ బెడ్ ఎక్కి ఫోన్​ పట్టుకుంటున్నారా? మీ మెదడులో జరిగే ప్రమాదకర మార్పులివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.