ETV Bharat / sukhibhava

మృదువైన చర్మ సోయగానికి ఇంటి చిట్కాలు.. - కాళ్ల సౌందర్యానికి చిట్కాలు

Skin Glow Tips At Home : చేతులు, కాళ్లు అందంగా కనిపించాలని.. కనిపించిన సౌందర్య ఉత్పత్తులన్నీ వాడటం వల్ల రసాయనాలు చర్మానికి హాని చేసే ప్రమాదం ఉంది. బదులుగా ఇంటి చిట్కాలను పాటించి చూడండి..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 11, 2022, 3:45 PM IST

Skin Glow Tips At Home : వాతావరణం ఎలా ఉన్నా సరే.. కొందరి చేతులు, కాళ్లు పొడిబారి, పగిలి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు కారణమేదైనా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. పాదాలు, అరిచేతులను కోమలంగా మార్చుకోవచ్చు.

  • కాళ్లు, చేతులపై మృతకణాలు పేరుకున్నప్పుడు కూడా చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. మీ పరిస్థితి కూడా ఇదే అయితే.. తరచూ మృతకణాలు తొలగించేందుకు ప్రయత్నించండి. దానికి సంబంధించిన కొన్ని పూతలు తయారుచేసి వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.
.
  • రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెను పాదాలకు రాసుకుని మర్దన చేయాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల పొడిబారిన చర్మం కాస్తా చాలా తక్కువ వ్యవధిలోనే మృదువుగా మారుతుంది.
  • గోరువెచ్చని నీటిలో కొద్దిగా వంటసోడా, ఏదైనా కొన్ని చుక్కల అత్యవసర నూనెను వేయాలి. కుదిరితే కొన్ని గులాబీ రేకలూ వేసుకోవచ్చు. ఇందులో చేతులు లేదా కాళ్లను ఓ పదినిమిషాలు ఉంచి తీసేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల చర్మం మృదువుగా మారుతుంది.
.
  • గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌ వేసుకుని అందులో కాళ్లు లేదా చేతుల్ని ఉంచాలి. పదినిమిషాల తర్వాత బయటికి తీసి కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ భాగాలకు రక్తప్రసరణ కూడా సజావుగా అందుతుంది.
  • సగం నిమ్మచెక్కను తీసుకుని చక్కెరలో ముంచి తీయాలి. దీన్ని కాళ్లు, చేతులకు రాసుకోవాలి. అలాగే రాత్రి నిద్రించే ముందు ఆలివ్‌నూనెను రాసుకుని, మర్దన చేసుకున్నా సరిపోతుంది. ఇది చర్మాన్ని ఎంతో కోమలంగా ఉంచుతుంది.

ఇవీ చదవండి: పక్షవాతం వస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా?

మీ పెంపుడు కుక్కకు వ్యాక్సిన్​ వేయించారా?.. లేకుంటే ఇబ్బందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.