ETV Bharat / sukhibhava

చలికాలంలో పిల్లలకు న్యూమోనియా ప్రమాదం - ఇలా చేయండి - లేకపోతే ఇబ్బందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 11:36 AM IST

Pneumonia Precautions for Children : చలికాలంలో పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. న్యూమోనియా ఎటాక్ అయితే.. ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది. తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలను ఆ వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవచ్చు.

Pneumonia Precautions for Children
Pneumonia Precautions for Children

Pneumonia Precautions for Children Safety : ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది. ఉదయం 8 దాటితే గానీ బయటకు రాలేని పరిస్థితి. పెద్దలే ఈ చలికి గజగజ వణుకుతుంటే.. పిల్లల పరిస్థితి..? ఈ కాలంలో పిల్లలను జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వేధిస్తుంటాయి. ఈ క్రమంలోనే న్యూమోనియా విరుచుకుపడే ప్రమాదం ఉంది. పిల్లలతోపాటు వృద్ధులూ దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. మరి.. పిల్లలను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశుభ్రత: దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు.. బాత్రూమ్​కి వెళ్లివచ్చినప్పుడు.. బహిరంగ ప్రదేశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. సబ్బుతో తప్పకుండా చేతులు కడుక్కోమని చెప్పండి. అలా చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించండి. చేతులు క్లీన్​ చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదని చెప్పండి. ఈ మార్గాల ద్వారానే వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

చలికాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి - ప్రమాదకరం కావొచ్చు!

ప్రయాణంలో రక్షణ : పాఠశాలలకు లేదా బయటకు వెళ్తున్నప్పుడు.. ఫేస్ మాస్క్‌ వాడకాన్ని ప్రోత్సహించండి. జలుబు, దగ్గు లక్షణాలు ఉండే వారి నుంచి సురక్షితమైన దూరాన్ని పాటించాలని చెప్పండి. వీలైతే.. జర్నీలో డోర్ హ్యాండిల్స్ లేదా రెయిలింగ్‌లు వంటి వాటిని తాకొద్దని చెప్పండి. ఒకవేళ పట్టుకుంటే తర్వాత హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించమని సూచించండి. క్లాస్​ రూమ్​లో సేఫ్టీ మెజర్స్ తప్పక పాటించాలని చెప్పండి.

PNEUMONIA CASES: కొవిడ్ ప్రభావం.. రెట్టింపు అవుతున్న న్యుమోనియా కేసులు

రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలు : న్యుమోనియా వ్యాప్తిని నివారించడానికి ఇంటి నివారణ ఏమీ లేనప్పటికీ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం. అందుకోసం పిల్లలు తగినంత నిద్రపోయేలా చూసుకోండి. పండ్లు, కూరగాయలతో పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల ఆహారం తీసుకునేలా చూడండి. అలాగే.. శారీరకంగా, చురుగ్గా ఉండేలా వారిని ప్రోత్సహించండి. ముఖ్యంగా పిల్లలు తీసుకునే ఫుడ్​లో సిట్రస్ పండ్లు, పెరుగు, ఆకుకూరలు వంటి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఉండేలా చూసుకోవాలి.

ఆ సమయంలో వైద్యుల సహాయం తీసుకోండి : ఇక చివరగా న్యూమోనియా వ్యాప్తికి సంబంధించి తాజా పరిణామాల గురించి పిల్లలకు తెలియజేయండి. అలాగే మీ పిల్లలు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా జ్వరం వంటి ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. వారి సలహాలు తీసుకోండి. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా మీ పిల్లలను న్యూమోనియా బారి నుంచి కాపాడుకోవచ్చు. జలుబు, దగ్గు వేధిస్తుంటే సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లడం మంచిది.

మునగ ఆకుతో 300 వ్యాధులకు చెక్ - ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

అధిక కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? - కరివేపాకుతో ఊహించని మార్పు - తేల్చిన రీసెర్చ్!

ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదా? 30-30-30 రూల్​ ట్రై చేస్తే అంతా సెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.