Moringa Oleifera Leaves Health Benefits : మునక్కాయలతో సాంబార్, కూర వంటివి చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ.. మునగ ఆకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఇవి దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
300 వ్యాధులకు చెక్: ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అమృతంలా పరిగణిస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుందట! దీని ఆకులు, కాడలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!
పోషకాల పవర్‌హౌజ్: NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
ఇతర ఆహారపదార్థాలతో పోలిస్తే:
- క్యారెట్లు తినడం ద్వారా వచ్చే విటమిన్ ఎ ని 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు.
- నిమ్మకాయలో ఉండే దాని కంటే 5 రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది.
- పాల నుంచి లభించే క్యాల్షియం కన్నా.. మునగాకు నుంచి 17 రెట్లు అధికంగా లభిస్తుంది.
- పెరుగు తినడం వల్ల లభించే ప్రొటీన్ల కన్నా.. మునగాకు నుంచి 8 రెట్లు అధికంగా పొందవచ్చు.
- అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కన్నా.. ఎండిన మునగాకులో 15 రెట్లు అధికంగా ఉంటుంది.
మీ పిల్లలు బరువు తగ్గుతున్నారా? కారణం ఇదేనట!
మునగాకు తినడం వల్ల ప్రయోజనాలు:
- మునగ ఆకులు విటమిన్ C ని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
- మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్లనొప్పులు వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో ఉపయోగపడతాయి.
- ఈ ఆకులు ఊబకాయం, బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
- డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
- పరిగడుపున ఈ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది.
- "డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మోరింగా ఒలిఫెరా లీఫ్ ప్రభావం చూపిస్తుంది" అని Journal of Ethnopharmacology లో ప్రచురితమైంది.
- మునగ ఆకులు ఎముకలకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం అందిస్తాయి.
- దీనితో పాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
- ప్రతిరోజూ మునగాకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
- మునగ ఆకులను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అల్సర్ వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు.
- ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచి, ఆరోగ్యకరమైన ప్రేగు కదలికకు కూడా దోహదపడుతుంది.
మీ మోచేతులు నల్లగా మారాయా? - ఈ టిప్స్‌తో అందంగా మెరిసిపోవడం ఖాయం!
- ఇది రక్తహీనతను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అంటే ఎర్ర రక్త కణాల లోపాన్ని నివారిస్తుంది.
- పాలు ఇచ్చే అమ్మలకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.
- గుప్పెడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించి.. ఆ నీరు చల్లారినతర్వాత అందులో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
- మునగాకు రసం ఒక స్పూన్ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్లలో కలిపి కొద్దిగా తేనె కలిపి తాగితే విరేచనాలు తగ్గిపోతాయి.
- మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోయి.. ముఖం అందంగా తయారవుతుంది.
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేస్తే ఎలాంటి ఖర్చు లేకుండా సమస్యకు చెక్ పెట్టొచ్చు!
వందగ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలు:
- నీరు: 75.9 శాతం
- పిండి పదార్థాలు: 13.4 గ్రా
- కొవ్వులు: 17 గ్రా
- మాంసకృత్తులు: 6.7 గ్రా
- కాల్షియం: 440 మిల్లీగ్రా
- పాస్పరస్: 70 మిల్లీగ్రా
- ఐరన్: 7 మిల్లీగ్రా
- విటమిన్ సి: 200 మిల్లీగ్రా
- ఖనిజ లవణాలు: 2.3 శాతం
- పీచు పదార్థం: 0.9 మిల్లీగ్రా
- శక్తి: 97 కేలరీలు
మిరియాలు- ఘాటైన రుచే కాదు, గమ్మత్తైన హెల్త్ బెనిఫిట్స్ కూడా! మిస్ అయ్యారంటే అంతే!
ఇంట్లో బియ్యం పురుగు పడుతోందా? - ఇలా చేశారంటే ఏడాదంతా నిల్వ చేసుకోవచ్చు!