How To Relief Stress In Pregnancy : గర్భందాల్చడం ప్రతీ మహిళ జీవితంలో ఎంతో కీలకమైన సందర్భం. బిడ్డకు జన్మనిస్తున్నాననే భావన వారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అయితే.. ఈ సమయంలోనే వారు శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? ఇందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే విషయాల పట్ల అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే మార్పులు, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గుల కారణంగా.. కాస్త ఒత్తిడి, ఆందోళన సహజమేనని నిపుణులు అంటున్నారు. కానీ.. తీవ్రమైన ఒత్తిడికి లోనవడం మంచిది కాదంటున్నారు. ఇలాంటి సమయంలో ఒత్తిడిని జయించాలంటే ఆహారమే అత్యుత్తమమైన ఔషధం అంటున్నారు. ఇందుకోసం కొన్ని రకాల పదార్థాల్ని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
'సి' విటమిన్..
'సి' విటమిన్ ఒత్తిడిపై ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందట. అందువల్ల గర్భిణులు విటమిన్ C ఎక్కువగా ఉండే కమలాఫలం, నిమ్మజాతి పండ్లు, బ్రకోలీ, స్ట్రాబెర్రీ వంటివి రోజువారీ మెనూలో చేర్చుకోవాలి.
పాల పదార్థాలు..
గర్భిణులు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలంటే.. ప్రొటీన్ అవసరం అవుతుంది. ఇందుకోసం రోజూ పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రాత్రివేళ హాయిగా నిద్ర పడుతుంది.
తృణధాన్యాలు..
ప్రెగ్నెన్సీ సమయంలో రోజూవారి ఆహారంలో తృణధాన్యాలను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతూ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్, ఓట్‌మీట్, గోధుమ బ్రెడ్ వంటివి తీసుకున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు (హ్యపీ హార్మోన్లు) విడుదల అవుతాయని సూచిస్తున్నారు.
Pregnancy Diet In Telugu : పండంటి బిడ్డకు జన్మనివ్వాలా?.. ఈ ఫుడ్ డైట్ ఫాలో అయిపోండి!
యోగా..
గర్భిణులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. సమతుల ఆహారంతోపాటు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. శరీరాన్ని, మనసునూ తేలికపరిచే శక్తి యోగాకు ఉంటుంది. యోగా వల్ల శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. గర్భం దాల్చిన తరవాత సాధారణంగా కనిపించే రక్తంలో పెరిగే చక్కెర స్థాయులు, అధిక రక్తపోటు వంటి సమస్యలను యోగా అదుపులో ఉంచుతుంది. శరీరంలోని కణాలన్నింటినీ రిలాక్స్‌డ్‌గా మార్చేస్తుంది. శరీరంలోని వేడిని సమతుల్యం చేస్తూ.. గర్భంలోని శిశువుకు ఆక్సిజన్‌ను తగినంతగా అందేలా చూస్తుంది. అయితే.. గర్భిణులు కొన్ని రకాల వ్యాయమాలను, యోగాసనాలు మాత్రమే చేయగలరు. ఇందుకోసం వైద్యులను సంప్రదించి.. వారి సూచన మేరకే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
సంగీతంతో..
గర్భిణులు ఖాళీ సమయాల్లో మంచి ఆహ్లాదకరమైన సంగీతం వినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు నచ్చిన సంగీతం వింటే శరీరం, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి రోజూ మీకు నచ్చినంత సేపు మ్యూజిక్ వినండి.
పుస్తకాలు చదవడం..
ప్రెగ్నెన్సీ సమయంలో ఉండే సాధారణ ఒత్తిడిని తగ్గించుకునేందుకు మహిళలు పుస్తకాలను చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తేజన్ని కలిగించేవి, హాస్యాన్ని పంచేవి, స్ఫూర్తి దాయకమైనవి ఈ లిస్టులో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల తల్లి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుందనీ.. కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
మహిళల్లో లైంగిక కోరికను పెంచే 5 సహజ పద్ధతులు! అవేంటో తెలుసా?