Home Remedies for Cracked Heels in Telugu: చలికాలంలో చాలా మందిని కాలి పగుళ్ల సమస్య వేధిస్తుంటుంది. కొంతమందికి రక్తం కారుతూ విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. మరి.. ఈ కాళ్ల పగుళ్లకు కారణాలు ఏంటి..? ఇలాంటి టైమ్‌లో ఏయే టిప్స్ పాటించి సమస్యను తగ్గించుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కాళ్ల పగుళ్లకు కారణాలు: ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం, హార్ష్ గా ఉండే సోప్స్, క్రీమ్స్ యూజ్ చేయడం, మరీ వేడీగా లేదా మరీ చల్లగా ఉండే వాతావరణం వంటివి.. పాదాల పగుళ్లకి దారి తీస్తాయి. కావలసినంత నీరు తాగకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. డయాబెటిస్, పోషకాహార లేమి, ఒబేసిటీ వంటివి కూడా పాదాల పగుళ్లకి కారణాలుగా చెప్పవచ్చు. అయితే.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొబ్బరి నూనె లేదా వాజలీన్ పట్టించడం జనరల్‌గా అందరం ఫాలో అయ్యే పద్ధతులు. కానీ.. కిచెన్లోనే ఉండే ఇంకొన్ని పదార్థాలతో సహజసిద్ధమైన ప్యాక్స్ ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు.
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని వర్క్ చేస్తున్నారా? బీ కేర్ ఫుల్- ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే!
ఇలా చేయండి: ఇప్పుడు చెప్పబోయే ప్యాక్స్ అప్లై చేసే ముందు.. పాదాల వద్దనున్న డెడ్ సెల్స్‌ని స్క్రబ్ చేయాలి. దీని కోసం వేడినీటిలో కొంత సోప్ వేసి, ఆ నీటిలో మీ పాదాలు మునిగేటట్లుగా ఉంచండి. ఆ నీరు మీరు భరించగలిగినంత వేడిగా ఉండాలి. స్కిన్ కొంత సాఫ్ట్ గా అయ్యాక ప్యుమిస్ స్టోన్‌తో స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఈ పని రాత్రి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్యాక్స్ ఏంటో చూద్దాం..
1. వేప, పసుపు:
కావాల్సినవి:
- వేపాకులు - పిడికెడు
- పసుపు - 3 టీస్పూన్లు
తయారీ:
- ముందుగా పిడికెడు వేపాకుల్ని తీసుకుని మెత్తటి ముద్దగా చేసుకోవాలి.
- అందులో 3 టీస్పూన్ల పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని మడమలకు పట్టించి అరగంట పాటు ఉంచాలి.
- తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకుని, పొడిగా అయ్యాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!
2. నిమ్మరసం, రోజ్‌వాటర్:
కావాల్సినవి:
- నిమ్మరసం- 1 టీస్పూన్
- గ్లిజరిన్- 1 టీస్పూన్
- రోజ్‌వాటర్- 1 టీస్పూన్
తయారీ:
- ఒక గిన్నెలో కాస్త గ్లిజరిన్‌లో ఒక్కో టీస్పూన్ చొప్పున నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి మడమలకు ప్యాక్‌లా వేసుకోవాలి.
- అలా 15 నుంచి 30 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- టవల్‌తో శుభ్రంగా తుడుచుకుని, పొడిగా అయిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- ఇలా రోజూ చేస్తే మడమల్లో పగుళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
మీకు బ్లూ టీ గురించి తెలుసా? బరువు తగ్గి నాజూగ్గా మారిపోతారు!
3. బియ్యప్పిండి, తేనె
కావాల్సినవి:
- బియ్యం పిండి-3 టేబుల్ స్పూన్
- తేనే-1 టీ స్పూన్
- యాపిల్ సైడర్ వెనిగర్-1 టీ స్పూన్
- ఆలివ్ ఆయిల్-1 టీ స్పూన్
తయారీ:
- రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో ఒక టీ స్పూన్ తేనె, మూడు నాలుగు చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి పేస్ట్ లా చేయండి.
- మీ పాదాలు మరీ డ్రై గా ఉంటే ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు.
- తరువాత ఈ పేస్ట్‌తో స్క్రబ్ చేసి.. అరగంట తర్వాత క్లీన్ చేసుకోండి.
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం!
బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా? అయితే ఈ లాభాలు మిస్ అయినట్లే!