Green Tea Health Benefits : గ్రీన్ టీ వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీనికి గిరాకీ ఎక్కువ. బరువు తగ్గడం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవటం సహా, చర్మ సంరక్షణకు తోడ్పడే ఔషధ లక్షణాలు ఇందులో ఉన్నాయి. చైనాలో దీని మూలాలు ఉన్నప్పటికీ.. దీనిలోని ప్రయోజనాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ టీ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు గ్రీన్ టీని తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
కామెల్లియా సినెన్సిస్ ఆకులను గ్రీన్ టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్, అల్జీమర్స్, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని ఇటీవలే విడుదలైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడు మనం గ్రీన్ టీ సేవించడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు..
Green Tea Weight Loss : గ్రీన్ టీలో పాలీఫెనాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరంలో ఆహారాన్ని కేలరీలుగా మార్చే రేటును కూడా పెంచుతుంది. ముఖ్యంగా మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడంలో గ్రీన్ టీ ఎంతగానో తోడ్పడుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా.. గ్రీన్ టీ మీ శరీరంలో జీవక్రియను మెరుగు పరిచి తద్వారా బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
క్యాన్సర్‌ను నిరోధిస్తుంది..
Benefits Of Green Tea : మన శరీరంలో అనియంత్రిత కణాల పెరుగుదల వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ వ్యాధి వల్ల ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రొమ్ము, కొలొరెక్టల్, అన్నవాహిక, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైన అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీని పాలు లేకుండా తీసుకోవాలి. దీనిలో పాలు కలపడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్ విలువలు తగ్గిపోతాయి.
షుగర్‌కు నివారణి..
Green Tea For Diabetics : మధుమేహంపై గ్రీన్ టీ ప్రభావం గురించిన అధ్యయనాలు సమగ్రంగా లేవు. కానీ కొంతమంది ఆరోగ్య నిపుణులు ఈ గ్రీన్ టీ టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుందని అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ టీ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా దాని పెరుగుదలను నిరోధిస్తుంది.
కొవ్వును కరిగిస్తుంది..
Green Tea Fat Loss : ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 10 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతే కాకుండా రక్తంలో మంచి కొలెస్ట్రాల్ మెరుగుపడి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీన్ని టీ రూపంలో లేదా క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవచ్చు.
బ్రెయిన్‌ను యాక్టివ్‌గా చేస్తుంది!
Green Tea Brain Benefits : గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో అందరికీ బాగా తెలిసిన స్టిమ్యులేటర్ కెఫీన్ ఉంటుంది. కాఫీలో ఉండేంత స్థాయి లేనప్పటికీ.. మీ మెదడును ఉత్తేజపరిచేందుకు ఇది సరిపోతుంది. కెఫిన్‌తో పాటు ఎల్-థియనైన్ అనే అమైనో యాసిడ్ కూడా ఇందులో ఉంటుంది. ఇవి రెండూ కలిసి మీ మెదడు చురుకుతనాన్ని పెంచుతాయి.
గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గిస్తుంది..
Green Tea Heart Benefits : శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్ టీ మన రక్తనాళాల లైనింగ్‌ను రిలాక్స్‌గా ఉంచడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుతుంది. రక్తపోటులో హెచ్చుతగ్గులను తట్టుకోవడానికి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా.. కార్డియాక్ అరెస్ట్‌కు ప్రధాన కారణమైన క్లాట్ ఏర్పడే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.
అల్జీమర్స్ వ్యాధి నివారణలోనూ..
Alzheimers Green Tea : పార్కిన్సన్స్, అల్జీమర్స్ లాంటి వ్యాధుల వల్ల కలిగే నష్టాన్ని గ్రీన్ టీ ఆలస్యం చేస్తుందని నమ్ముతారు. ఒక అధ్యయనం ప్రకారం.. గ్రీన్ టీ మెదడులోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసి, చనిపోకుండా కాపాడుతుంది. వృద్ధాప్యంలో మెదడు క్షీణించకుండా కూడా ఇది రక్షిస్తుంది. ఇందులోని కాటెచిన్ సమ్మేళనాలు న్యూరాన్‌లను రక్షిస్తాయి. ఫలితంగా మతిమరుపు తగ్గుతుంది.
దంతాలు మరింత దృఢంగా..
Green Tea Teeth Benefits : గ్రీన్ టీ దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని కాటెచిన్ సమ్మేళనాలు వైరస్, బ్యాక్టీరియాలను నిరోధించి ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాల ద్వారా.. స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ (బ్యాక్టీరియా) పెరుగుదలను నిరోధిస్తుంది. ఫలితంగా నోటి దుర్వాసన, కావిటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
Green Tea Blood Pressure : పలు అధ్యయనాల ప్రకారం.. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల రక్తపోటు సాధారణ స్థాయికి తగ్గుతుంది.
చర్మ సంరక్షణలో..
Green Tea Skin Benefits : గ్రీన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యంలో వచ్చే ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 2007లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. సోరియాసిస్ లాంటి అనేక చర్మ వ్యాధుల చికిత్సకు గ్రీన్ టీ గొప్ప ఔషధంగా పనిచేస్తుందని వెల్లడైంది. గ్రీన్ టీని తాగడం వల్ల చర్మ వాపులను కూడా నయం చేసుకోవచ్చు.