ETV Bharat / sukhibhava

ఈ '5' ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడిచేసి తింటున్నారా? - అయితే మీరు ప్రమాదానికి వెల్​కమ్​ చెప్పినట్లే! - ఆహార పదార్థాలను వేడి చేసి తింటే అనారోగ్య సమస్యలు

Reheating Food Side Effects : సాధారణంగా ఇంట్లో అన్నం, కూరలు మిగిలితే.. పడేయడం ఇష్టం లేక వాటిని ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత రోజు వేడి చేసుకుని తింటుంటాం. ఇక చలికాలంలో అయితే వండిన కొద్దిసేపటికే ఆహారాలు చల్లగా అవుతాయి. దీంతో.. వాటిని మరల వేడి చేసుకుని తినేస్తుంటాం. అయితే ఆహారాన్ని పదేపదే వేడి చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా ఈ 5 పదార్థాలను అసలు వేడిచేసి తీసుకోవద్దంటున్నారు. అవేంటంటే..

Reheating Food
Reheating Food
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 9:46 AM IST

Reheating Food Disadvantages in Telugu : మనలో చాలా మంది వండిన పదార్థాలను మరోసారి వేడి చేసుకుని హాట్ హాట్​గా తింటుంటారు. అలా తినడం వల్ల వేడి పదార్థాలు తిన్నట్లుగా ఉందనే ఫీలింగ్ వస్తుంది. ఇక చలికాలంలో అయితే ఆహారం(Food) వండగానే తొందరగా చల్లగా అయిపోతుంది. దాంతో చల్లగా అయిన ఆహారాన్ని తిందామంటే గొంతు దిగదు. దీంతో మళ్లీ వేడిచేసుకుని తింటారు.

Reheating Food Side Effects : అదే విధంగా ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని వండినప్పుడు పడేయడానికి మనసొప్పక, వృథా చేయలేక మిగిలిన దాన్ని ఫ్రిజ్​లో పెట్టి తర్వాత రోజు తింటూ ఉంటారు. కానీ, ఆహారాన్ని పదేపదే వేడి చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా వేడి చేయడం ద్వారా వాటిలో ఉండే పోషకాలు నాశనం అవుతాయని, కొన్నిసార్లు టాక్సిన్స్ ఫామ్ అయ్యి ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు. ముఖ్యంగా ఈ 5 ఆహార పదార్థాలను వండిన తర్వాత తిరిగి అసలు వేడి చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ 5 ఆహార పదార్థాలు ఏంటి? వాటిని మరల వేడి చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలేంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పాలకూర(Spinach) : వారానికి ఒకసారైన.. పాలకూర(Spinach), ఇతర ఆకుకూరలతో చాలా మంది వంటలు చేసుకుంటుంటారు. అయితే పాలకూరతో చేసే సూప్​, పన్నీర్ కాంబినేషన్ గ్రేవీ, పప్పు వంటి వంటకాలు చేసినప్పుడు చల్లగా అయితే పడేయలేక, మిగిలిపోతే ఫ్రిజ్​లో పెట్టుకుని.. మళ్లీ వేడిచేసుకుని తింటాం. కానీ, దీన్ని పదేపదే వేడి చేస్తే ఇందులో ఉన్న నైట్రేట్​లు నైట్రోజినేస్​గా మారతాయి. అప్పుడు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని కణజాలం దెబ్బతింటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పాలకూర వంటకాలు వేడి చేయకపోవడమే మంచిది.

అన్నం(Rice) : ఎక్కువ మంది పొద్దున్న మిగిలిన అన్నాన్ని.. సాయంత్రం వేడి చేసుకుని తింటుంటారు. అలాగే కొందరు మిగిలిన రైస్​ను ఫ్రైడ్ రైస్, స్నాక్స్ చేస్తుంటారు. కానీ అన్నాన్ని తిరిగి వేడి చేయడం అస్సలు మంచిది కాదు. అలా చేయడం ద్వారా అన్నంలోని షోషకాలు పోతాయి. దాంతోపాటు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఇందులో పెరిగి.. ఫుడ్ పాయిజన్​కు కూడా కారణమవుతుంది.

బంగాళాదుంపలు(Potato) : ఇక చిన్నపిల్లలతో మొదలు పెద్దల వరకు చాలా మందికి బంగాళదుంప(Potato) ఫ్రై లేదా కర్రీ ఇష్టముంటుంది. దాంతో అవి వండినప్పుడు మిగిలితే వేడి చేసుకుని మరీ లాగించేస్తుంటారు. అయితే బంగాళాదుంపలను మళ్లీ వేడిచేయకూడదు. అలా చేస్తే అందులో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. వేడి చేయడం ద్వారా వాటిల్లో ఉండే బి-6, పొటాషియం, విటమిన్-సి విచ్చిన్నం అవుతాయి. అప్పుడు ఆ కర్రీని తింటే పోషకాలేమీ లభించకపోగా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సీతాఫలం తింటే జలుబు చేస్తుందా? - ఆయుర్వేదం ఏం చెబుతుంది!

మాంసాహారం(Non-veg) : చికెన్, గుడ్లు వంటి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్​లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక మాంసాహారప్రియులైతే చికెన్(Chicken), మటన్ కర్రీ మిగిలితే.. ఫ్రిజ్​లో స్టోర్​ చేసుకుని నెక్ట్​డే మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. అయితే వీటిని ఒకసారి వండిన తర్వాత మళ్లీ వేడిచేసి తీసుకుంటే.. ఫుడ్ పాయిజనింగ్, జీర్ణసంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే తిరిగి వేడి చేయడం ద్వారా అందులోని ప్రోటీన్ కంపోజిషన్ మారిపోతుంది.

పుట్టగొడుగులు(Mushrooms) : దీనిని వెజిటేరియన్స్ నాన్​వెజ్ అంటారు. వీటిలోనూ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటితో చేసిన వంటకాలు పదేపదే వేడి చేసి తిన్నా, నిల్వ ఉంచి తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వేడి చేయడం ద్వారా ఇందులో ప్రోటీన్లు, ఖనిజాలు.. విష పదార్థాలుగా మారుతాయి. అప్పుడు వీటిని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కేవలం ఇవి అనే కాదు.. మిగతా ఏ ఆహారాలు అయినా అప్పటికప్పుడు చేసుకుని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రేక్ ఫాస్ట్​లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

పరగడపున టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఇది తెలియకపోతే డేంజర్​లో పడ్డట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.