ETV Bharat / sukhibhava

మామిడి పండ్లు బాగా తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

పండ్లలో రారాజు మామిడి పండు అని అందరికి తెలిసిందే.. రంగులోనే కాకుండా రుచిలోనూ మామిడి అద్భుతం. బహుశా అందుకేనేమో దాన్ని రారాజు అని పిలుస్తారు. వేసవిలోనే అందుబాటులో ఉండే ఈ పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మామిడిలో విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మామిడి పండు.. గుండె ఆరోగ్యానికి మరింత దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Mangoes stave of heart diseases
Mangoes stave of heart diseases
author img

By

Published : May 7, 2022, 7:35 AM IST

Mango Benefits: హాట్‌.. హాట్‌ సమ్మర్‌లో దొరికే టేస్టీ..టేస్టీ మామిడి పండ్లంటే ఇష్టముండని వారుండరు. చాలా మంది మామిడి పండ్లు రుచి ఎంజాయ్‌ చేయడానికి వేసవి ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే మామిడి పండ్లకు ఉండే క్రేజ్ అలాంటిది. మామిడి పండు రుచిలోనే కాదు పోషకాల్లోనూ రారాజే.. ఈ పండులో విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయారియా, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా శరీరానికి ఎంతో అవసరమైన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

మామిడి పండును తరచూ తింటే గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చని నిపుణులు అంటున్నారు. "బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. మామిడిలో ఉండే ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వల్ల గుండె నుంచి ప్రవహించే ధమనుల్లో ఎలాంటి అడ్డంకి లేకుండా కాపాడుతాయి. పాలీఫెనాల్ బయోయాక్టివ్‌గా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి పండ్లలో విటమిన్​ ఎ, సి సమృద్ధిగా లభ్యమవుతాయి. శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. మామిడి తొక్కలో ఉండే కెమికల్​ శరీర కొవ్వును తగ్గిస్తుంది." అని నిపుణులు చెబుతున్నారు.

"మామిడి సీజన్​లో రోజుకొక పండు తినొచ్చు. అందువల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్​ బారి నుంచి తప్పించుకోవచ్చు. మామిడిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మితంగా తింటే శరీరం హెల్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయానికి దారి తీయకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. మామిడి పండు తినడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. రక్త హీనత సమస్య ఉన్న వాళ్లు తింటే చాలా మంచిది. ఏదేమైనా లెక్కకు మించి తినకూడదు."

- నిపుణులు

ఇదీ చదవండి: అందరి దృష్టి దానిపైనే.. ఈ 'బరువు' కథ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.