Do not Put These Items in Fridge : ప్రస్తుత రోజుల్లో రిఫ్రిజిరేటర్ల వాడకం సర్వసాధారణమైంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వండిన ఆహార పదార్థాలు పాడవ్వకుండా, కూరగాయలు, ఇతర పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేందుకు ఫ్రిజ్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే.. వీటి వినియోగం, మెయింటెనెన్స్‌పై మాత్రం ప్రజలకు అవగాహన ఉండట్లేదు. వండిన పదార్థాలు వేస్ట్ అవ్వకూడదంటూ ఫ్రిజ్‌లో పెడతారు కానీ.. ఎలాంటి ఆహారాలు ఫ్రిజ్‌లో పెట్టాలి? వేటిని పెట్టకూడదు? అనేది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈ నాలుగు ఆహార పదార్థాలను ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
అలర్ట్ - ఈ తప్పులు చేస్తే మీ ఫ్రిజ్ పేలిపోతుంది!
ఉల్లిపాయ(Onion): ఆనియన్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఒకవేళ ఫ్రిజ్‌లో వీటిని స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలోని పిండి పదార్ధం చక్కెరగా మారుతుంది. దీంతో వాటికి త్వరగా బూజు పడుతుంది. చాలా మంది ఉల్లిపాయను కోసి సగాన్ని వంటల్లో వాడతారు. మిగిలిన సగం భాగాన్ని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే.. ఇవి అనారోగ్యకరమైన బ్యాక్టీరియాను ఆకర్షించి పాడవుతాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వెల్లుల్లి(Garlic): ఒలిచిన వెల్లుల్లిని మార్కెట్ల నుంచి అసలు కొనుగోలు చేయకూడదు. అలాగే.. వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడితే.. వాటిపై మచ్చలు, బూజు త్వరగా ఏర్పడి చెడిపోతాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా మారి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే.. వెల్లుల్లిని గడ్డలుగానే కిచెన్‌లో పెట్టాలి. అవసరమైనప్పుడే వాటిని ఒలిచి, వెంటనే వంటల్లో వాడాలి.
అన్నం(Rice): చద్దన్నం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే.. కొందరు మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, తర్వాతి రోజు తింటారు. స్టార్చ్ రెసిస్టెన్స్ కారణంగా ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందనే వాదన ఉంది. కానీ.. త్వరగా చెడిపోయే లక్షణాలు ఉన్న అన్నాన్ని ఫ్రెష్‌గానే తినాలి. ఒకవేళ రిఫ్రిజిరేట్ చేయాలనుకుంటే.. 24 గంటలు మించకూడదని నిపుణులు తెలుపుతున్నారు.
అల్లం(Ginger): అల్లంలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. దీన్ని వంటల్లో అలాగే టీ తయారీలో కూడా వాడతారు. చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ రిస్క్‌ను అల్లం టీ తగ్గిస్తుంది. అయితే.. అల్లం ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టవచ్చు. దీన్ని అలాగే వాడితే మూత్రపిండాలు, కాలేయ వైఫల్యం సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల అల్లం ఫ్రిజ్‌లో స్టోర్ చేయడానికి బదులు బయటే ఉంచి వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
How to Stop Bad Smell From Fridge : ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుందా?.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!
కొత్త ఫ్రిజ్ కొంటున్నారా?.. అయితే ఈ వివరాలు ఉన్నాయో లేదో చూసుకోండి!
చికెన్, ఫిష్ వండుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! ఫ్రిజ్‌లో పెడితే..