ETV Bharat / sukhibhava

కారణం లేకుండానే బరువు తగ్గుతున్నారా? అయితే షుగర్​ టెస్ట్ చేసుకోండి! - మధుమేహం ఆహార నియమాలు

షుగర్ వ్యాధి లక్షణాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. దీని వల్ల జబ్బును ఆలస్యంగా గుర్తిస్తారు. ఈ వ్యాధి లక్షణాల్లో బరువు తగ్గడం కూడా ఒకటి. షుగర్.. ఇప్పుడు ఈ పేరు వింటే ఎవరైనా సరే భయపడే పరిస్ధితి ఏర్పడింది. షుగర్ వ్యాధి పేరు వింటేనే చాలామంది జంకుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే ఇక మన శరీరాన్ని వదిలిపెట్టదు. షుగర్ వ్యాధి లక్షణాలు చాలా ఉంటాయి. బరువు తగ్గడం షుగర్ వ్యాధి లక్షణమా? ఇప్పుడు తెలుసుకుందాం..

Diabetes Symptoms
మధుమేహ వ్యాధి లక్షణాలు
author img

By

Published : Jun 9, 2023, 10:12 AM IST

Diabetes Symptoms : మధుమేహం, డయాబెటిస్, షుగర్.. ఇలా పేరు ఏదైనా వ్యాధి ఒకటే. ఎవరి నోటి నుంచి ఈ పదాలు వచ్చయంటేనే చాలు.. అందరికీ భయమేస్తోంది. ఎందుకంటే ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి. ఎన్నో అరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అదుపు తప్పితే ఇక అంతే సంగతి. క్రమంగా ఆరోగ్యం క్షీణించి మరణం సంభవించే ప్రమాదం ఏర్పడుతుంది.

షుగర్ వ్యాధి లక్షణాలు..

  • ఎక్కువగా దాహం వేయడం
  • ఎక్కువగా ఆకలి అనిపించడం
  • ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం
  • కంటి చూపు మందగించడం
  • ఏ కారణం లేకుండానే శరీర బరువు తగ్గడం
  • అస్తమానం బద్ధకంగా ఉండటం

బరువు తగ్గుతుంటే షుగర్ వచ్చినట్లేనా..?
ఎలాంటి కారణం లేకుండా శరీర బరువు తగ్గడం కూడా షుగర్ వ్యాధి లక్షణమేనని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొంతమంది వ్యాయామం, డైట్ లాంటివి చేయడం వల్ల బరువు తగ్గుతారు. శరీరం ఫిట్‌గా ఉండేందుకు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా అయితే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఎలాంటి కారణం లేకుండా (వర్కౌట్లు చేయకుండా) బరువు తగ్గుతుంటే ఓ సారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.

రోజూ మనం తీసుకునే ఆహారం శరీరానికి అందకుండా మూత్ర విసర్జన ద్వారా వెళ్లిపోతుంది. బరువు తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. స్త్రీ, పురుషులు ఎవరైనా సరే ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గుతున్నామని భావిస్తే షుగర్ టెస్ట్ వెంటనే చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఓసారి షుగర్ టెస్టు చేయించుకోవడం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అయితే వంశపార్యపరంగా కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ తండ్రి లేదా తాతలకు డయాబెటిస్ ఉంటే మీరు కూడా షుగర్ టెస్ట్ చేయించుకుంటే సందేహం తీరిపోతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తీపితో కూడిన ఆహార పదార్ధాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటే మంచిది. రోజూ వ్యాయామం చేయడం ద్వారా షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. సరైన ఆహార నియామాలను పాటిస్తే.. త్వరగా షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

షుగర్ లెవల్స్ పెరిగితే ప్రమాదమే..
షుగర్ స్థాయిలు అధికంగా ఉంటే శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం పడుతుంది. ఈ షుగర్ స్థాయిలు గుండె మీద ప్రభావం చూపినట్లయితే గుండెపోటుకు దారి తీస్తుంగి. మెదడు మీద ప్రభావం చూపడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే కంటి నరాలపై పడినట్లయితే కంటిచూపు మందగిస్తుంది. ఒకవేళ కిడ్నీలపై ప్రభావం చూపితే కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంది. శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ తప్పితే ఇలా ముఖ్య భాగాలపై ప్రభావం పడి చివరికి మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.