Cosmetics Impact on Skin: యవ్వనంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే అందుకోసం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, మానసిక ఒత్తిళ్లు మన చర్మంపై ప్రభావం చూపిస్తాయనే విషయం తెలిసినా.. కాస్మొటిక్స్ వాడకానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చర్మ సంరక్షణకు ఎంత విలువైన కాస్మొటిక్స్ వాడినా.. మన శరీరంలో చర్మానికి కావాల్సిన హార్మోన్ల ఉత్పత్తి సమపాళ్లలో లేకపోతే.. ప్రయోజనం ఉండదు. అందుకే చర్మ సంరక్షణకు ఎలాంటి కాస్మొటిక్స్ వాడాలి? వీటి కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి? లాంటి విషయాలు తెలుసుకోండి.
కాస్మొటిక్స్ వాడకం-చర్మంపై ప్రభావం: కాస్మొటిక్స్ తయారీలో వాడే రసాయనాలు చర్మంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాస్మొటిక్స్ వాడినప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో అనేక సమస్యలే కాకుండా అలర్జీలు తలెత్తుతాయి. మొదటగా చర్మ సమస్యలు తెచ్చిపెట్టేది ఫ్రాగ్రెన్సెస్, ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్, మూడోది రంగు రసాయనాలు. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం, చెడిపోకుండా ఉండటం కోసం.. ఆకర్షణీయమైన రంగు కోసం.. ఈ మూడింటినీ తప్పనిసరిగా కలుపుతారు. ఇవే చాలా చర్మ సమస్యలకు మూలం.
కొన్ని రకాల డైలు పడకపోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు వంటివి రావడం జరుగుతుంది. కొన్ని రకాల క్రీముల కారణంగా మొటిమలు రావొచ్చు. కొంతకాలానికి ముఖం నల్లగా మారుతుంది. కాస్మొటిక్స్ ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడుతున్నప్పుడు చర్మంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అనేది గమనిస్తూ సమస్యలు వస్తే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కాస్మొటిక్స్ వాడే ముందు వాటి లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. కొన్నేళ్లుగా మార్కెట్లో ఆదరణ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడం కొంతవరకు మేలు. కాస్మొటిక్స్‌లో వాడే పదార్థాలేమిటో చూసి కొనుక్కోవడం మంచిది. గాఢమైన వాసన, ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవద్దు. అందానికి కాస్మొటిక్స్ వాడటం కన్నా నీరు ఎక్కువగా తాగడం, కంటి నిండా నిద్ర, పండ్లు, కూరగాయలు మంచివని గుర్తించాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: వేసవిలో కాస్మొటిక్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తెలుసుకోండి..