ETV Bharat / sukhibhava

మీ పిల్లలు ఫోన్ వదలట్లేదా? - ప్రాణాంతకం కావొచ్చు - ఇలా వదిలించండి!

How to Stop Child Phone Addiction : స్మార్ట్​ఫోన్ లేకపోతే మా పిల్లలు అన్నం తినట్లేదు అంటారు ఒక పేరెంట్.. ఫోన్ ఇవ్వకపోతే గుర్రుగా చూస్తున్నారని కంప్లైంట్ చేస్తారు మరొకరు! ఇలాంటి పరిస్థితినే మీరూ ఫేస్ చేస్తున్నారా? అయితే.. ఈ స్టోరీ మీకోసమే!

How to Stop Child Phone Addiction
How to Stop Child Phone Addiction
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 3:01 PM IST

How to keep Children away from smartphones : ఇప్పుడంతా టెక్నాలజీ యుగం.. స్మార్ట్​ఫోన్​ అనే చిన్న పరికరం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాంతో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్​ఫోన్​ను ఉపయోగిస్తున్నారు. ఇదే అలవాటు పిల్లలకు కూడా వస్తోంది. ఈ క్రమంలో నేటి జనరేషన్ పిల్లలు స్మార్ట్​ఫోన్(Smart Phone) లేకుండా అరక్షణం గడపలేని పరిస్థితి ఏర్పడింది. వారి చేతిలో ఫోన్ ఉంటే చాలు ఎలాంటి ఆట వస్తువులతో పని లేదు.. అమ్మ పక్కనుందో లేదో కూడా చూసుకోకుండా.. వీడియోలు చూస్తూ కాలం వెళ్లదిస్తుంటారు. ఇలా వాడడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

Best Tips to keep Your Child Away from Mobiles : ముఖ్యంగా ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చొని ఫోన్​ను యూజ్​ చేయడం ద్వారా చిన్న వయసులోనే పిల్లలు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు టీవీ లేదా ఫోన్ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువనే తినేస్తారు. ఈ కారణంగా పిల్లల్లో భవిష్యత్తులో మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తున్నారా? ఇప్పటికైనా ఆలస్యం కాలేదు.. మీ పిల్లలు మీ చేతిలోనే ఉన్నారు.. మేము చెప్పే ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. వారిని ఈజీగా ఫోన్ల నుంచి దూరంగా పెట్టొచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ముందు మీరు మానేయండి.. పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు అనుకరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి వారి ముందు తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం మానుకోవాలి. వాళ్లతో మాట్లాడటం, ఆడుకోవడం, కబుర్లు చెప్తూ ఉంటే పిల్లలు కూడా అదే విధానం కొనసాగిస్తారు.

ప్రత్యామ్నాయం ఆలోచించండి.. చాలా మంది పిల్లలు కాస్త అల్లరి చేయగానే, ఏడుపు ఆపడానికి ఫోన్‌ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని పిల్లల్లో ఏడ్చి మరీ ఫోన్‌ తీసుకోవాలనే ఆలోచనా ధోరణి పెరుగుతుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పిల్లలు ఏడ్చినా, అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలి.

ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి.. ఒకవేళ మీ పిల్లలకు ఫోన్‌ చూస్తూ తినే అలవాటు ఉంటే.. వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు పిల్లలు అల్లరి చేయరు. మొబైల్‌ ఫోన్​ గురించి ఆలోచించరు. అప్పుడు తిండిపైనే ధ్యాస పెడతారు. ఆ టైమ్​లో మీరు కూడా ఫోన్ లేకుండా వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటలు ఎలా ఉన్నాయో అడగండి. సరదాగా నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ గడిపితే స్మార్ట్​ఫోన్ ఫోన్‌ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు.

పిల్లలకు స్మార్ట్​ ఫోన్​ ఇస్తున్నారా... జర భద్రం

పుస్తక పఠనం అలవాటు చేయండి.. ఈ మధ్యకాలంలో బుక్ రీడింగ్ చాలా తగ్గిపోయింది. ఇంట్లో పెద్దవాళ్లు కూడా భోజనం చేశాక.. ఫోన్ పట్టుకుని మంచమెక్కేస్తారు. ఇకపై అలా చేయకుండా పడుకునే ముందు వారికి ఒక మంచి పుస్తకం ఇచ్చేలా ప్లాన్ చేయండి. చిన్నప్పటి నుంచే పిల్లలకు బుక్ రీడింగ్ అలవాటు చేయడం ద్వారా వారి ఆలోచనా శక్తి, రాయడం వంటి నైపుణ్యాలు పెరుగుతాయి. అయితే ముందు బొమ్మల పుస్తకాలతో వారికి మొదలు పెట్టండి. ఆ తర్వాత పజిల్స్ పూర్తి చేయడం కథల పుస్తకాలు చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్​ఫోన్​పైకి మళ్లదు.

వారితో కాసేపు గడిపేలా ప్లాన్ చేసుకోండి.. బాల్యం నుంచే పిల్లలు చుట్టుపక్కల చిన్నారులతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. ఒకవేళ వారి వయసు పిల్లలు లేకపోతే వీలైతే వారితో కాసేపు మీరే ఆడుకోండి. అలాగే ఔట్​డోర్ ఆటలు, చెస్, క్యారమ్స్ వంటివి ఆడటం అలవాటు చేస్తే.. వారు స్మార్ట్​ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు.

మీరూ మరింత తెలుసుకోండి.. రోజు రోజుకీ పిల్లలు విజ్ఞానవంతులు అవుతున్నారు. నేటితరం పిల్లలకు టెక్నాలజీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే తెలుసు అని చెప్పాలి. అందువల్ల తల్లిదండ్రులకు ఏం తెలియదు అనుకుంటే పిల్లలు తప్పులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మీ పిల్లలకు ప్రతి విషయం గురించి తెలుసుకుని చెప్పాలి. దీంతో వారికి మీ మీద గౌరవం కూడా పెరుగుతుంది.

స్మార్ట్​ఫోన్​ యూనివర్సిటీలో అంతసేపు అవసరమా..?

రోజుకు సగటున 7 గంటలు స్మార్ట్​ఫోన్​తోనే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.