ETV Bharat / sukhibhava

టైఫాయిడ్, కొవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు విపరీతంగా ఊడుతోందా? - వైద్యులు సూచించిన బెస్ట్ ట్రీట్​మెంట్ ఇదే!

Best Tips for Hair Loss : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో హెయిర్ ఫాల్ అనేది కామన్ అయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కాకపోతే కొంతమందిలో టైఫాయిడ్, కొవిడ్ లాంటివి వచ్చి తగ్గాక విపరీతంగా జుట్టు ఊడుతోంది. అలాంటి వారికోసం వైద్యులు సూచించిన బెస్ట్ ట్రీట్​మెంట్ తీసుకొచ్చాం. ఇది ఫాలో అయ్యారంటే ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

Hair Fall
Hair Fall
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 1:25 PM IST

Best Treatment for Hair Fall after Typhoid : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్.. జుట్టు రాలడం. ఇప్పుడు ఇది కామన్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, పని ఒత్తిడి, సరైన నిద్రలేకపోవడం ఇలా ఎన్నో కారణాలు హెయిర్ ఫాల్​కి దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే కొంతమందిలో టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత కూడా జుట్టు ఊడే(Hair Fall) సమస్య అధికంగా ఉంటుంది. దీంతో చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దాంతో ఏం చేయాలో తెలియక ఏవేవో హెయిర్ ఆయిల్స్ వాడుతూ విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. అసలు టైఫాయిడ్ వచ్చి తగ్గాక ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు? ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Best Treatment for Hair Loss After Covid : హెయిర్ ఫాల్ సమస్య ఒక్క టైఫాయిడ్ తగ్గిన తర్వాతనే కాదు.. మన బాడీని ఒత్తిడికి గురిచేసే ఏవిధమైన ఇన్​ఫెక్షన్స్ సోకిన ఈ ప్రాబ్లమ్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే నార్మల్​గా ఆడవాళ్లైనా, మగవాళ్లైనా రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలుతుంటాయి. కానీ.. టైఫాయిడ్, డెంగ్యూ, కరోనా లాంటివి ఎటాక్ చేసినప్పుడు రోజూ రాలాల్సిన వెంట్రుకలు ఊడిపోవు. ఎందుకంటే అప్పుడు ఈ వెంట్రుకలు విశ్రాంతి స్టేజ్​లోకి వెళ్తాయి. దీనినే కెటాజెన్ ఫేజ్ అంటారు. దాంతో అప్పుడు నిద్రావస్థలో ఉన్న వెంట్రుకలు టైఫాయిడ్ తగ్గిన మూడు నెలల తర్వాత ఒక్కసారిగా ఊడడం మొదలెడతాయి. ఇలా రాలడాన్ని అక్యూట్ టీలోజెన్ ఎఫ్లూవియం అంటారు. ఈ దశలో మనం జుట్టు దువ్వినప్పుడు కుచ్చులు కుచ్చులుగా హెయిర్ ఊడిపోతుంది. ఇక కొందరిలో జస్ట్ చేతితో ముట్టుకున్నా విపరీతంగా వెంట్రుకలు రాలుతాయంటున్నారు వైద్యులు.

మూడు, నాలుగు నెలల వరకు ఇలాంటి స్థితే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ టైమ్​లో అయ్యో జుట్టు ఊడిపోతోందే అని ఆందోళన చెందితే.. ఒత్తిడి పెరిగి మరింత ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. దీని గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఊడిపోయిన జుట్టు నూటికి 90 మందికి తిరిగి వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ టైమ్​లో ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండాలంటున్నారు. ఇకపోతే టైఫాయిడ్ తగ్గిన తర్వాత హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులు సూచించిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

జుట్టు రాలిపోతుందా? ఇలా ట్రై చేసి చూడండి

  • ముఖ్యంగా పైన చెప్పిన విధంగా ఉండడంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవాలి. డైలీ ఎగ్స్, మొలకెత్తిన విత్తనాలు, ఫ్రూట్స్, కూరగాయలు మీ డైట్​లో చేర్చుకోవాలి.
  • అవసరమైతే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి, జుట్టు పెరగటానికి తోడ్పడే ప్రొటీన్లు, బయోటిన్‌ వంటి విటమిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయవచ్చు.
  • ఇకపోతే మీరు తల స్నానానికి ఉపయోగించే బోరుబావి వాటర్​కు బదులుగా.. మృదువైన మంచి నీటిని యూజ్​ చేయండి. అలాగే కెఫీన్‌, అమైనో ఆమ్లాలతో కూడిన షాంప్స్​ను హెడ్​ బాత్​లో ఉపయోగించండి.
  • అదేవిధంగా పడుకునే ముందు వెంట్రుకల కుదుళ్లకు కెపిక్సిల్‌ లేదా రెడెన్సీల్‌ వంటి ప్రొటీన్‌ సీరమ్‌లు అప్లై చేయండి. ఎందుకంటే ఇవి నిద్రావస్థలో ఉన్న హెయిర్ కుదుళ్లును ఉత్తేజితం చేయడంతో పాటు కొత్త వెంట్రుకలు మొలవటానికి తోడ్పడతాయి.
  • అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఇవి రిజల్ట్ చూపించటానికి 3-4 నెలలు పడుతుంది. ఇకపోతే ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా మీ జుట్టు తిరిగి మొలవకపోతే పీఆర్‌పీ చికిత్స, మీసోథెరపీ ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.

Anemia Hair Fall: ఇవి పాటిస్తే మీ జుట్టు రాలదు!

జుట్టు రాలిపోతుందా?.. కారణాలు ఇవే కావొచ్చు!.. వీటిని తింటే సెట్​!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.