ETV Bharat / sukhibhava

పెదవులు నల్లగా ఉన్నాయా? - ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి! - best tips to get natural pink lips in telugu

Home Remedies for Natural Pink Lips: కారణం ఏదైనా కావొచ్చు.. చాలా మంది పెదవులు నిర్జీవంగా తయారై నల్లగా మారుతుంటాయి. ఆ నలుపుదనం తగ్గించుకోవడానికి ఏవేవో బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడతారు. అయినా నో యూజ్​..! అయితే, ఈ సమస్యకు కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతో చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా..?

Home Remedies for Natural Pink Lips
Home Remedies for Natural Pink Lips
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 9:50 AM IST

Tips for Natural Pink Lips: లిప్స్ ఆరోగ్యంగా ఉంటేనే.. అవి అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా అమ్మాయిల అందాన్ని మరింత రెట్టింపు చేసేవి వారి పెదవులే. అయితే.. కొన్ని కారణాలతో పెదాలు నిర్జీవంగా మారుతుంటాయి. మరీ ముఖ్యంగా చలికాలంలో.. పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ కారణంగా నలుగురు ముందుకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. మీరు కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నట్టయితే.. ఈ సింపుల్ టిప్స్ తో గులాబీ రేకుల్లాంటి పెదాలను మీసొంతం చేసుకోండి.

పెదవులు ఎందుకు నల్లగా మారతాయి?: రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, తీవ్ర మానసిక ఒత్తిడి, డ్రగ్స్, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్ లేదా మెలస్మా వంటివి కూడా పెదాలు నల్లబడటానికి కారణం కావచ్చు. ఇంకా.. ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడేవారి పెదాలు ఇలా ఉండవచ్చు. వేడి టీ, కాఫీలు అతిగా తాగేవారికి కూడా పెదవులు నల్లబడతాయి. ఈ సమస్యకు పరిష్కారం.. మీరు ఓ 15 నిమిషాలు సమయం కేటాయించడమే!

లిప్​స్టిక్ : రెగ్యులర్‌గా లిప్‌స్టిక్‌ వాడేవాళ్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. అందువల్ల లిప్‌స్టిక్‌ను ఎక్కువసేపు ఉంచుకోవద్దు. బయటి నుంచి రాగానే ఆలివ్‌ ఆయిల్‌ లేదా బాదం ఆయిల్‌తో లిప్‌స్టిక్‌ను తొలగించుకోవాలి.

కొబ్బరినూనె, తేనె, చక్కెరతో ఎక్స్ ఫోలియేట్: షుగర్​లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల పెదాలను ఎండ నుంచి కాపాడుతాయి. మాయిశ్చరైజింగ్​తో పాటు తేనెలోని ఎంజైమ్​లు పెదవుల రంగుని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి. కొంచెం కొబ్బరినూనె తీసుకుని.. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పెదాల మీద స్క్రబ్ చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు. ఇది పెదవులపై చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా, అందమైన రంగులోకి మారుస్తుంది.

శీతాకాలంలో జుట్టు చిట్లిపోతోందా? - ఇలా సిల్కీగా మార్చుకోండి!

పాలు పసుపు ప్యాక్: పాలు, పసుపు కలిసి పెదవులు పాలిపోకుండా చేస్తాయి. సహజంగా పింక్ పెదాలను ఇస్తాయి. ఈ పేస్ట్​ని స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఒక టీ స్పూన్ పాలు, అర టీ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుని ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి. పేస్ట్ ఆరిన తర్వాత సున్నితంగా కడగాలి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజింగ్ లిప్ బామ్​ను అప్లై చేసుకోవాలి.

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇలా చేస్తే ముఖం ఎంతో తాజాగా ఉంటుంది!

అలోవెరా జెల్: అలోవెరాలో అధిక మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది తేమని తిరిగి నింపడంలో సహాయపడుతుంది. పగిలిన, పొడి బారిన పెదాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. పెదాలను పింక్ కలర్​లోకి మార్చేస్తుంది. ఇందుకోసం.. తాజా కలబంద జెల్ బయటకి తీసుకోవాలి. కొబ్బరి లేదా ఆలివ్ నూనె రెండు చుక్కలు అందులో వేసుకోవాలి. ఒక గిన్నెలో పెట్టుకుని దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఎన్ని సార్లు అయినా దీన్ని రాసుకోవచ్చు.

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!

రోజ్​ వాటర్​: రోజ్​ వాటర్​ ప్రతిరోజూ పెదాలకు రాసుకోవడం వల్ల లేత గులాబీ రంగులోకి మారతాయి.

నెయ్యి: పెదవులు పగిలి బాధ పెడుతుంటే నెయ్యి కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది.

స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే.. నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.

నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుందా ? ఈ హోమ్​మేడ్​ టిప్స్​తో రిలీఫ్​ పొందండి!

చలికాలంలో మీ జుట్టు డల్​గా ఉంటుందా? - ఈ టిప్స్‌ పాటిస్తే సిల్కీ హెయిర్​ గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.