ETV Bharat / sukhibhava

ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!

Migraine Reduced Foods : మైగ్రేన్​.. ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీంతో బాధపడేవారికి సాధారణ తలనొప్పిని​ మించి ఇబ్బందులు ఉంటాయి. ఏళ్లకు ఏళ్లు ఈ బాధ అనుభవిస్తుంటారు. ఇలాంటి వారు ఆహారంలో మార్పు చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు!

Migraine Reduced Foods
Migraine Reduced Foods
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 5:24 PM IST

Best Foods to Reduce Migraine: ఒక వైపు మాత్రమే తీవ్రమైన తలనొప్పి.. చిరాకు, వాంతులు, వికారం, కంటిచూపు సరిగా ఉండకపోవడం.. వంటి లక్షణాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. సాధారణ తలనొప్పులతో పోలిస్తే.. మైగ్రేన్ గంటల నుంచి రోజుల పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ సమస్యకు పూర్తి చికిత్స లేకపోయినా.. ఉపశమనానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. హెల్తీ ఫుడ్ తినడం వల్ల రిలీఫ్​ పొందొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

మీరు నేల మీద పడుకోవడం లేదా? ఈ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి!

పాలకూర: ఇతర ఆకుకూరలతో పోలిస్తే.. పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో ప్రొటీన్స్, పిండి పదార్థాలు, ఫైబర్ ఉన్నాయి. అంతేకాకుండా.. విటమిన్​ A, విటమిన్​ B6 వంటివి కూడా సమృద్ధిగా ఉన్నాయి. కాగా.. పాలకూరను ప్రతిరోజూ తినడం వల్ల మైగ్రేన్​ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని 2019లో పర్డ్యూ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో స్పష్టమైంది.

ఓట్స్​: బ్లడ్​లో షుగర్​ స్థాయిలు తగ్గినా మైగ్రేన్​ వచ్చే ఛాన్స్​ పెరుగుతుంది. కాబట్టి ఓట్స్​ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఓట్స్‌లో కావాల్సిన విటమిన్లు, ఫైబర్​, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

మీ మోచేతులు నల్లగా మారాయా? - ఈ టిప్స్​తో అందంగా మెరిసిపోవడం ఖాయం!

జీడిపప్పు: జీడిపప్పులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ Eతో పాటు యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా అందులో ఉండే కాపర్​ కూడా మైగ్రేన్​ నుంచి రిలీఫ్​ పొందడానికి ఉపయోగపడుతుంది. అలాగే బాదం, గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల మైగ్రేన్​ మైగ్రేన్​ తగ్గే అవకాశం ఉందని.. 2017లో మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం నిరూపితమైంది.

నానబెట్టిన కిస్మిస్​ ​: ఎండుద్రాక్షలో ఐరన్‌, పొటాషియం, విటమిన్‌-సి పుష్కలంగా ఉన్నాయి. కిస్​మిస్​, నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్​గా మీ డైట్​లో చేర్చుకుంటే మైగ్రేన్​ నుంచి రిలీఫ్​ పొందొచ్చు. ​

బెల్లం పసుపుతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? అస్సలే వదిలి పెట్టరు!

జీలకర్ర, యాలకులు: జీరా అండ్​ ఇలాచి వాటర్ తాగడం వల్ల కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని నీళ్లలో ఓ స్పూన్​ జీలకర్ర, కొన్ని యాలకులు వేసి బాగా మరిగించి తాగడం వల్ల యూజ్​ ఉంటుంది.

ఆవు నెయ్యి: ఆవునెయ్యిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మైగ్రేన్​ సమస్య నుంచి రిలీఫ్​ పొందొచ్చు. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ వైరల్ ఏజెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి.

చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేస్తే ఎలాంటి ఖర్చు లేకుండా సమస్యకు చెక్​ పెట్టొచ్చు!

ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? విషంతో సమానం జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.