Anti Aging Tips in Telugu: అందంగా, ఫిట్‌గా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? కానీ.. వయస్సు మీదపడే కొద్దీ దేహం పట్టు కోల్పోతూ ఉంటుంది. అందం మెల్ల మెల్లగా కరిగిపోతూ ఉంటుంది. వయసు 40 దాటే సరికి.. చర్మం నిగారింపు కోల్పోతుంటుంది. ముఖ వర్చస్సు తగ్గడం, ముఖంపై ముడతలు, చర్మం సాగడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే.. కొన్ని సూచనలు పాటిస్తే చర్మంపై నిగారింపుతోపాటు అందాన్ని నిలబెట్టుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటే చూడాలనుందా? - తల్లిదండ్రులుగా మీరు ఇవి చేయాలి!
ప్రస్తుత కాలంలో మనం పాటించే జీవన శైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే.. శరీరానికి అందవలసిన పోషకాలు లభించకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇంకా ఆరోగ్య సంరక్షణ కూడా సవాలుగా మారుతుంది. నాణ్యత లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యలను అరికట్టడానికి కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో.. 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా యవ్వనంగా కనిపించవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం 7 టిప్స్ సూచిస్తున్నారు. అవి ఏంటంటే..?
హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!
- యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు తినడం వల్ల చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపించవు.
- క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- ఫేషియల్ ముఖ చర్మాన్ని సరైన రీతిలో శుభ్రం చేస్తుంది. ఫేషియల్ మాస్కులు చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు సహాయపడతాయి.
- సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల బయటకు వెళ్లినప్పుడు చర్మానికి నష్టం జరగదు. చర్మం యవ్వనంగా ఉంటుంది.
- అండర్ ఐ జెల్ లేదా సీరమ్ ఉపయోగించడం వల్ల కళ్లకింద నల్లని వలయాలు, ఐ బ్యాగ్స్, కళ్లు ఉబ్బడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. తద్వారా అందంగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది.
- వ్యాయామం శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది. యోగా, ఈత, ఏరోబిక్, శ్వాస వ్యాయామాలు, బరువులు ఎత్తడం వంటివి శరీరాన్ని ఒకవైపు ధృడంగా ఉంచుతూ యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా? - ఈ 4 వర్కౌట్స్ చేస్తే రిజల్ట్ పక్కా!
ఎన్ని పాటించినా చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా లేదంటే కొల్లాజెన్ లోపం ఏర్పడిందని అర్థం. శరీరానికి అత్యంత అవసరమైన ప్రోటీన్స్ లో కొల్లాజెన్ ఒకటి. ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది. అంతే కాకుండా ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. వయసు పెరిగినా యంగ్ లుక్‌లో కనిపించాలంటే కొల్లాజెన్ అత్యవసరం. సమతుల్యమైన ఆహారం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఉదయం వ్యాయామం, యోగా, వాకింగ్ వంటివి చేయడం ద్వారా కూడా కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.