KARNATAKA WINE SMUGGLING: పోలీసులంతా గణతంత్ర దినోత్సవాల హడావుడిలో నిమగ్నమైన వేళ కర్ణాటక నుంచి అక్రమ మద్యాన్ని తరలిస్తూ దొరికిపోయాడు. వైఎస్సార్సీపీ నాయకుడు ఇండ్ల శివరాం వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో చురుగ్గా పనిచేస్తున్నాడు శివరామ్.
కర్ణాటక నుంచి రాష్ట్రానికి బెంగళూరు నుంచి తన కారులోనే 50 కేసుల ఖరీదైన మద్యాన్ని లోడ్ చేశాడు. అదోదో చాటుమాటుగా కాదు కారు అద్దాల నుంచి బయటకు కనిపించేలా అట్టపెట్టలు ఎక్కించేశాడు. దొంగ సరుకుతో రావడం తప్పని తెలిసినా దర్జాగా కర్ణాటక దాటి రాష్ట్రంలోకి ప్రవేశించాడు. పక్కా సమాచారం అందుకున్న వైఎస్సార్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖాజీపేట వద్ద ఇండ్ల శివరామ్ కారు ఆపారు. పెద్దగా తనిఖీ లేవీ చేయాల్సిన పనికూడా రాలేదు.
యథేచ్చగా: కారు అద్దాల నుంచే మద్యం కేసులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని యథేచ్చను చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు కారుతోపాటు మద్యం కేసులను నిందితుడు శివరాంను కడప ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో విచారిస్తున్నారు.
మద్యం సీసాల విలువ: ఇండ్ల శివరాం కారులో దొరికిన కర్ణాటక మద్యం సీసాల విలువ దాదాపు 20 లక్షల రూపాయలపైనేఉంటుందని అబ్కారీశాఖ అధికారులు అంచనావేస్తున్నారు.
వైఎస్సార్సీపీతో సంబంధం లేదు: నిందితున్ని శుక్రవారం జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. ఈ విషయంపై దుమారం రేగడం, వైఎస్సార్సీపీ పై విమర్శలు వెల్లువెత్తడంతో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పందించారు. ఇండ్ల శివరాంకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇవీ చదవండి