ETV Bharat / state

గెలుపు కోసం వైఎస్సార్​సీపీ అభ్యర్థి తాయిలాల ఎర.. ఉపాధ్యాయులకు టిఫిన్ బాక్సులు పంచే యత్నం - వైఎస్సార్సీపీ

YCP MLC CANDIDATE GIFTS TO TEACHERS: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడమే ఆలస్యం.. కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ అభ్యర్థి తాయిలాల ఎరకు తెర తీశారు. వివిధ పాఠశాలల వద్ద టిఫిన్ బాక్సులు పంచే ప్రయత్నం చేయగా ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కానుకల పంపిణీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

MLC GIFTS
MLC GIFTS
author img

By

Published : Feb 11, 2023, 7:23 AM IST

YCP MLC CANDIDATE GIFTS TO TEACHERS : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి ఒకరోజ అయినా గడవక ముందే.. వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తున్న అభ్యర్థి రామచంద్రారెడ్డి తరపున.. ఉమ్మడి కడప జిల్లాలో కానుక పంపిణీ మొదలైపోయింది. మార్చి 16వ తేదీ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో.. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు లంచ్‌, టిఫిన్ బాక్సులను తాయిలాలుగా పంపిస్తున్నారు. కడప గర్ల్స్ హైస్కూల్‌లో గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేస్తున్న వారిని సీపీఐ నాయకులు పట్టుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి తాయిలాల ఎర.. ఉపాధ్యాయులకు టిఫిన్ బాక్సులు పంచే యత్నం

"కడపలో ఉపాధ్యాయులకు లంచ్​, టిఫిన్​ బాక్సులు పంచడానికి ఆటోలలో తీసుకొచ్చారు. వారి ప్రయత్నాన్ని మేము అడ్డుకుని ఆటో, ఆటో డ్రైవర్​, లంచ్​ బాక్సులను వన్​టౌన్​ పోలీస్​స్టేషన్లో అప్పగించాము. ఎన్నికల కోడ్​ నిబంధనలు ఉల్లఘించిన వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ తరఫున డిమాండ్​ చేస్తున్నాము"-వెంకట శివ, సీపీఐ నేత

కడప జిల్లా బద్వేల్‌, అన్నమయ్య జిల్లా నందలూరు సహా పలు చోట్ల పాఠశాలలో బాక్స్​లు పంచేందుకు ప్రయత్నించగా.. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు తీసుకునేందుకు తిరస్కరించారు. దీంతో బాక్సుల్ని అక్కడే వదిలేసి వెళ్లారు. కానుకల పంపిణీ విషయం సీఐటీయూ, డివైఎఫ్ఐ, ఉపాధ్యాయ సంఘాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఎన్నికల సిబ్బంది గిఫ్ట్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం సీఎం జగన్ అడ్డదారుల్లో ప్రయత్నించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

"జగన్​.. ఎన్నికలన్నింటీని భ్రష్ఠు పట్టిస్తున్నారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో అన్ని రకాల అవినీతులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్సీ నోటీఫికేషన్​ విడుదల అయ్యి ఒక్కరోజన్న గడవకముందే.. ఎన్నికల్లో గెలుపు కోసం ఉపాధ్యాయులకు గిఫ్ట్​ల పంపిణీ ప్రారంభించారు. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్​లు అందరూ ఈ దుర్మార్గాన్ని ఖండించాలి"- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ప్రలోభాలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కత్తి నరిసింహ డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్‌ గురించి అవగాహన లేక తమ వాళ్లు బాక్సులు పంపిణీ చేశారని రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. విషయం తెలిశాక కానుకల పంపిణీ నిలిపివేశామని చెప్పినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.