వాల్మీకులు తలపెట్టిన తిరుమల పాదయాత్రను వైకాపా నాయకుడు ఆకేపాటి అనిల్ కుమార్రెడ్డి ప్రారంభించారు. కడప జిల్లా రాజంపేటలోని బోయపాలెం నుంచి ఈ యాత్ర ఆరంభం అయింది. ముందుగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలు.. చెక్కభజన మధ్య మహా పాదయాత్ర వైభవంగా సాగింది.
ఇదీ చదవండీ.. కట్టిపడేస్తోన్న వంజంగి పొగమంచు అందాలు