ETV Bharat / state

sixth class student died: న్యాయం జరగకపోతే.. ఆత్మహత్య చేసుకుంటాం: సోహిత్​ తల్లిదండ్రులు

author img

By

Published : Jul 2, 2023, 1:04 PM IST

Beeram Sridhar Reddy School student Sohit death updates: ముమ్మాటికి తమ కొడుకును పాఠశాల సిబ్బందే కొట్టి హత్య చేశారని, ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని.. బీరం శ్రీధర్‌ రెడ్డి పాఠశాలలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సోహిత్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8న పులివెందులకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను కలిసే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు.

Sohit death
Sohit death

Beeram Sridhar Reddy School student Sohit death updates 'ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఉంటున్న మాకు.. న్యాయం జరగకపోతే నేను, నా భార్య, బిడ్డలం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. నా కొడుకును పాఠశాల సిబ్బంది ఎందుకు కొట్టి హత్య చేశారు..? అనే విషయం నాకు తెలియాలి. నాకు న్యాయం జరగకపోతే నేను బతికి కూడా నిష్ప్రయోజనమే' అంటూ బీరం శ్రీధర్‌ రెడ్డి పాఠశాలలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సోహిత్‌ (11) తండ్రి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి జగన్.. పులివెందులకు రానున్నారని, ఆయనను కలిసి తన బాధను వివరించే అవకాశాన్ని కల్పించాలని అధికారులను వేడుకున్నారు.

సీఎం జగన్ సార్..మాకు న్యాయం చేయండి: తల్లిదండ్రులు

సీఎం‌ను కలిసే అవకాశం కల్పించండి.. వైయస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం కొత్తపేట సమీపంలోని బీరం శ్రీధర్‌ రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సోహిత్‌ (11) శనివారం రోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాఠశాల సిబ్బంది కొట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనకు దిగారు. తమ కుమారుడి పొత్తి కడుపు వద్ద, చేతిపై, వెనక భాగంలో కమిలిన గాయాలున్నాయని.. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి.. తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరయ్యారు.

లక్షన్నర ఫీజు కట్టి..కొడుకుని పోగొట్టుకున్నాం.. ఈ సందర్భంగా విద్యార్థి సోహిత్‌ (11) తండ్రి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ.. బీరం శ్రీధర్‌ రెడ్డి పాఠశాల సిబ్బంది కొట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని దంపతులిద్దరూ గుండెలు పగిలేలా రోదించారు. ''కొన్ని వారాల క్రిందటే మా రెండవ కొడుకు (సోహిత్)ను వైయస్సార్ జిల్లా చెన్నూరు మండలంలోని కొత్తపేట వద్ద ఉన్న బీరం శ్రీధర్ రెడ్డి ప్రవేట్ పాఠశాలలో ఆరో తరగతి చేర్పించాము. పాఠశాలలో చేర్పించేటప్పుడే లక్షన్నర ఫీజు కట్టాము. శుక్రవారం రోజు రాత్రి 9:30 నుంచి 10:30 దాకా సోహిత్ వసతి గృహంలోకి రాలేదని, పదిన్నర గంటల తరువాత వచ్చి ఏడ్చుకుంటూ పడుకున్నాడని.. మా అబ్బాయితో ఉండే పిల్లలు చెప్పారు. తెల్లవారుజామున 5 గంటలకు కడుపు నొప్పి వస్తుందని పాఠశాల సిబ్బందికి చెప్పడంతో వారు మాకు ఫోన్ చేశారు. మేము వచ్చేసరికి మా అబ్బాయిని పాఠశాల ఆవరణంలో పడుకోబెట్టారు. వెంటనే బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లాము. కానీ, అప్పటికే నా కొడుకు చనిపోయాడని డాక్టర్లు పరీక్షించి చెప్పారు'' అని అన్నారు.

పాఠశాల సిబ్బందే కొట్టి హత్య చేశారు.. అనంతరం తన బిడ్డ శరీరంపై కమిలిన గాయాలున్నాయని.. తన కొడుకును కొట్టడానికి గల కారణాలు ఏమిటో..? పాఠశాలు సిబ్బంది చెప్పాలని విద్యార్థి తండ్రి నాగరాజు డిమాండ్ చేశారు. నిన్నటి నుంచి నరకయాతన అనుభవిస్తున్నప్పటికీ.. తమకు సరైన రీతిలో న్యాయం జరగలేదని వాపోయారు. 'మా కొడుకు ఎలాగో పోయాడు, ఇక తిరిగి రాడు.. కాకపోతే అతని మరణానికి కారణం ఏంటో అధికారులు స్పందించి.. విచారణ చేపట్టి నాకు చెప్పాలి' అని కోరుతున్నారన్నారు. ముమ్మాటికి తన కొడుకును పాఠశాల సిబ్బందే కొట్టి హత్య చేశారని ఆరోపించారు.

అసలు ఏం జరిగిందంటే.. పులివెందులకు చెందిన నాగరాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, ఆయన భార్య లలిత వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నారు. రెండు వారాల కిందట వారు తమ కుమారుడు సోహిత్‌ (11)ను బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. శనివారం ఉదయం సోహిత్‌ పాఠశాల నుంచి తన తండ్రికి ఫోన్‌ చేసి కడుపునొప్పిగా ఉందని చెప్పాడు. ఆయన వెంటనే కడపలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాలకు వెళ్లేసరికే నిర్వాహకులు సోహిత్‌ను వరండాలో పడుకోబెట్టారు. బంధువులు వెంటనే బాలుణ్ని ద్విచక్రవాహనంపై సమీపంలోని చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.

విచారణ ప్రారంభం: బీరం శ్రీధర్‌రెడ్డి స్కూల్‌లో విద్యార్థి మృతిపై విచారణ కొనసాగుతోంది. ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ ఖాజీపేటలోని స్కూల్​కు వెళ్లి.. సోహిత్ మృతికి కారణాలపై ఆరా తీస్తోంది. ఘటనకు దారి తీసిన వివరాలు సేకరిస్తోంది. సోహిత్ మృతి చెందిన హాస్టల్‌ను కమిటీ బృందం పరిశీలిస్తోంది.

Jeevan Murder Case: జీవన్​ని పెట్రోల్​ పోసి తగలబెట్టి ఉండొచ్చు.. పోలీసుల అనుమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.