వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ నాయకులు కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలన వల్ల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి.. రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
ఇదీ చదవండి:
పూర్వ విద్యార్థుల సహకారం.. బడికి సౌకర్యం