ETV Bharat / state

CM Jagan Tour: రేపు వైఎస్​ఆర్​ జయంతి.. ఇడుపులపాయకు సీఎం జగన్​ - AP farmers day

CM Jagan Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ చేరుకొని.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు.

CM JAGAN
సీఎం జగన్
author img

By

Published : Jul 7, 2023, 8:10 PM IST

CM Jagan Tour: దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించనున్న వైఎస్సార్ రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ రేపు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మూడు రోజుల నుంచి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పలువురు అధికారులు, నేతలు పర్యవేక్షిస్తున్నారు. అధిక సంఖ్యలో పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణ కోసం అనంతపురం జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల నుంచి వందల సంఖ్యలో బస్సులను కళ్యాణదుర్గం రప్పించారు. ఈ కార్యక్రమంలో 2022 ఖరీప్‌లో పంటలు నష్టపోయిన రైతులకుబీమా పరిహారం నిధులను విడుదల చేయనున్నారు. అదేవిధంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు.

ఇడుపలపాయలో నివాళులు: అనంతపురంలో రైతు దినోత్సవం సభ తర్వాత.. సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపలపాయకు చేరుకోనున్నారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 1:55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. ప్రతి సంవత్సరం జగన్, అతని సోదరి, వైటీపీ అధ్యక్షురాలు షర్మిల, తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించేవారు. కానీ ఈ ఏడాది విడివిడిగా వస్తుండటం గమనార్హం. కాగా ఇప్పటికే వైఎస్ షర్మిల, విజయమ్మ.. ఇడుపులపాయకు చేరుకున్నారు.

వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్న సీఎం జగన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8, 9, 10 తేదీల్లో.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో పులివెందులలో సీఎం వైఎస్ జగన్ పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులతో కలిసి పరిశీలించారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

మరో శంకుస్థాపనకు సిద్ధం అవుతున్న జగన్ సర్కార్: వైఎస్సార్ జిల్లాలో జగన్ సర్కార్ మరో భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతోంది. చారిత్రాత్మకమైన, పర్యాటకంగా అభివృద్ధి చెందిన గండికోటలో ఒబెరాయ్ హోటల్స్ సంస్థ 50 ఎకరాలలో 250 కోట్ల రూపాయల బడ్జెట్​తో 120 విల్లాలను నిర్మించనుంది. ఈ నెల 9వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒబెరాయ్ ప్రతినిధులతో కలసి అక్కడ భూమి పూజ నిర్వహించనున్నారు.

సీఎం జగన్ పర్యటన సందర్బంగా ముమ్మర ఏర్పాట్లు: సీఎం జగన్ రాక సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్‌ దిగేందుకు హెలిప్యాడ్​ను, శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని పరిశీలించి అక్కడే చిన్న సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల 20 నిముషాలకు చేరుకొని.. 10 గంటల 30 నిముషాలకు తిరిగి వెళ్లనున్నారు. ఒబెరాయ్ హోటల్స్‌ను ఇటు కోట అటు పెన్నా నది వ్యూ కనిపించేలా నిర్మించనున్నారని సమచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.