YS Viveka murder Case: తనకు రక్షణ కల్పించాలని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా, అకస్మాత్తుగా తన గన్‌మెన్లను మార్చారని ఆయన ఆరోపించారు. గన్‌మెన్లను మార్చడంపై దస్తగిరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్ ఆదేశాలతోనే కడప ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. తొండూరు మండల వైకాపా నేతలు తనపై కేసులు పెట్టిస్తున్నారని వాపోయారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలని దస్తగిరి పేర్కొన్నారు. తన రక్షణ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కడప ఎస్పీ పట్టించుకోవడం లేదని దస్తగిరి ఆరోపించారు.
ఎస్పీ ఏమన్నారంటే..: దస్తగిరి ఆరోపణలపై కడప ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. దస్తగిరికి గన్‌మెన్ల మార్పు అనేది పాలనాపరమైన అంశమన్నారు. తొండూరులో ఘర్షణ జరిగినప్పుడు గన్‌మెన్లు సరిగా స్పందించలేదన్నారు. దస్తగిరి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఇవి చదవండి: