రాయలసీమలోని నాలుగు జిల్లాలకు తలమానికం అయిన రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం (RTPP) మూసివేత ఆలోచన విరమించుకోవాలని జమ్మలమడుగు పాత బస్‌స్టాండ్‌లో ఉన్న ఆటో స్టాండ్ వద్ద యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి నిచ్చిన పరిశ్రమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూసేందుకు చూస్తున్నాయని డీవైయఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ ఆరోపించారు. పాలకులు ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. థర్మల్ ప్రాజెక్ట్‌లో వచ్చే ప్లే యాష్ వలన సిమెంట్, బ్రిక్స్ పరిశ్రమలు ఏర్పడ్డాయని.. కేవలం పెట్టుబడిదారుల సొంత పరిశ్రమల కోసం ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయాలనుకోవడం సరి కాదన్నారు. ఇప్పటికైనా ఈ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఈ పరిశ్రమని నిలబెట్టేందుకు కృషి చేయాలని కోరారు.
ఇవీ చూడండి..