కడప జిల్లా లింగాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. కలువ పూల కోసం వెళ్లిన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. కడప జిల్లా కడప మండలం మాసాపేటకు చెందిన కరుణాకర్ అనే యువకుడు అనంతపురం జిల్లా దాడితోట గ్రామంలో తన స్నేహితుల ఇంటికి వెళ్లి సరదాగా సిబిఆర్ డ్యాం వద్దకు విహారయాత్రకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు.
అక్కడ నీటిలో కలువ పువ్వులు ఉండడంతో వాటిని తీసుకు వచ్చేందుకు వెళ్లి చెట్ల పొదల్లో ఇరుక్కుపోయి బయటకు రాలేక నీటిలో మునిగి మృతి చెందాడు. తోటి స్నేహితులు కరుణాకర్ ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నీటి కుంట వద్దకు వచ్చి గజల్ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: కొవిడ్తోనే రక్తం గడ్డకట్టే ముప్పు అధికం!