యోగి వేమన విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌వో) అవార్డు సాధించి.. అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నిర్వహణ నాణ్యత ప్రమాణాలను పాటించడంతోపాటు పర్యవరణ పరిరక్షణలో విశ్వవిద్యాలయం తన ప్రత్యేకతను చాటుకున్నందుకు ఈ పురస్కారం దక్కింది. న్యూదిల్లీకి చెందిన ఏ క్యూ సీ మిడిల్ ఈస్ట్ సంస్థ.. విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌వో గుర్తింపు ధ్రువపత్రాలను అందజేసింది.
విశ్వవిద్యాలయం అకడమిక్ క్వాలిటీ మేనేజిమెంటు సిస్టం ప్రమాణాలకు అనుగుణంగా ఉందని గుర్తించి ఈ విభాగంలో ఐఎస్‌వో 9001-2015 ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. పర్యవరణ నిర్వహణ విభాగంలోనూ ఐఎస్‌వో 14001-2015 అవార్డును వర్సిటీ సాధించింది. విశ్వవిద్యాలయం పరిసరాల్లో పచ్చదనం, పరిశుభ్రత, సహజ ఇంధన వనరుల వినియోగం తదితర ప్రమాణాలను పాటిస్తూ విశ్వవిద్యాలయం పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న నేపథ్యంలో గుర్తింపు లభించింది.
గ్రామీణ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలు అందించడం, సాంకేతికత వినియోగం, ఉపాధి అవకాశాల కల్పన, శిక్షణ, నియామకాలకు యోవేవి కృషి చేస్తోందని వీసీ ఆచార్య ఎం.సూర్య కళావతి పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ విద్య ఉపాధి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సభ్యత్వం, గుర్తింపు సంస్థ పొందిందన్నారు.
ఇదీ చదవండి: