కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను సికింద్రాబాద్‌లో కలిశారు. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు కొత్త రైల్వే లైన్‌కు సంబంధించిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన జీఎం... డిసెంబర్ మొదటి వారానికల్లా సర్వే నివేదికను రైల్వే బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
మరోవైపు కడప- బెంగళూరు మధ్య రైల్వే లైన్‌కు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు కమలాపురం పట్టణంలో ఆర్యూబీ, ఆర్వోబీ పనులు త్వరగా మొదలు పెట్టాలని కోరారు.
ఇదీ చదవండి