ETV Bharat / state

వైకాపా నేతల దాడిలో గాయపడిన తెదేపా నాయకుడు

author img

By

Published : Mar 14, 2020, 12:23 PM IST

నామినేషన్ పత్రాలు ఎన్ని దాఖలయ్యాయో వివరాలు తెలుసుకునేందుకు రాయచోటి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన తెదేపా నాయకుడిపై వైకాపా నేతలు దాడికి దిగారు. ఎన్నికల్లో గెలవలేక ఈ విధంగా దాడులు చేస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు.

ycp-leaders-assault-on-tdp-leaders-in-rayachoti
వైకాపా నేతల దాడిలో గాయపడిన తెదేపా నాయకుడు
వైకాపా నేతల దాడిలో గాయపడిన తెదేపా నాయకుడు

కడప జిల్లా రాయచోటి పురపాలక కార్యాలయం వద్ద తెదేపా జిల్లా అధికార ప్రతినిధి గాజుల ఖాదర్ బాషాపై వైకాపా నాయకులు దాడి చేశారు. దాఖలైన నామినేషన్ల వివరాలు తెలుసుకునేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన ఖాదర్​ బాషాపై అక్కడే ఉన్న వైకాపా నాయకులు అరుణ్ బాష, చిల్లీస్ ఫయాజ్ ఇతర నేతలు దాడికి దిగారు. దాడి విషయం తెలుసుకున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. వైకాపా నేతల దాడిలో గాడపడిన ఖాదర్ బాషా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైకాపా నాయకులు దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఎన్నికల్లో గెలవలేమని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పోలీసు అధికారులు సహకరించకపోయినా,కోర్టు ద్వారా వైకాపా నేతలకు అడ్డుకట్ట వేస్తామన్నారు.

ఇదీ చదవండి: రాయచోటి ఎస్పీడీసీఎల్ ఏఈపై అనిశా దాడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.