కడప జిల్లా బ్రహ్మంగారిమఠం ముడుమాల వద్ద వైకాపా నాయకుడు భాస్కరరెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బి. విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ విషయాన్ని వెల్లడించారు. జడ్పీటీసీ నామినేషన్ విషయంలో ముడుమాల గ్రామానికి చెందిన భాస్కరరెడ్డి, పలుగురాళ్లపల్లె గ్రామానికి చెందిన బసిరెడ్డి దుగ్గిరెడ్డి గొడవలు పడుతూ వచ్చారని, పగ పెంచుకున్న దుగ్గిరెడ్డి తన అనుచరులు బసిరెడ్డి రామిరెడ్డి, బసిరెడ్డి రమణారెడ్డిలతో కలిసి ఇనుపరాడ్లతో కలిసి దాడి చేసి భాస్కర్ రెడ్డిని హతమార్చినట్లు వివరించారు. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని సీఐ కొండారెడ్డి, ఎసై శ్రీనివాసులు కలిసి సిద్ధయ్యగారిమఠం క్రాస్‌రోడ్డు వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఎద్దుల బండిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం: ఒకరు మృతి