రాష్ట్రాభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణ మేలని మాజీమంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారన్నారు. ఇలాంటి సమయంలో మూడు రాజధానులపై రెఫరెండం కోరడం చంద్రబాబు నాయుడు అమాయకత్వానికి నిదర్శనమన్మారు. అమరావతి రాజధానిపై వేలాది ఎకరాలు ఖర్చు పెట్టడం ప్రజలకు ఇష్టం లేదన్నారు. రేపు ప్రజల ముందుకు వస్తానంటున్న చంద్రబాబు నాయుడు, లోకేశ్, పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే ప్రజలకు కాస్తోకూస్తో నమ్మకం కలుగుతుందని ఘాటుగా విమర్శించారు.
ఇవీ చదవండి