ETV Bharat / state

తెదేపా కార్యకర్తపై వైకాపా కార్పోరేటర్ అనుచరుల దాడి

YCP Corporator attack on TDP worker: తెదేపా కార్యకర్తపై వైకాపా కార్పోరేటర్, తన అనుచరులు దాడి చేశారు. తెదేపా కార్యకర్త అయిన నరసింహ ప్రసాద్ ఇటీవల తెదేపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అక్కసుతో దాడి చేసి కర్ర తీసుకొని అతని తలపై గట్టిగా కొట్టారు. గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా తెదేపా నాయకులు ఆయన్ని పరామర్శించారు. ఈ ఘటనపై తక్షణం కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

తెదేపా కార్యకర్తపై వైకాపా కార్పోరేటర్ దాడి
corporator attack tdp activist
author img

By

Published : Oct 25, 2022, 2:11 PM IST

YCP Corporator attack on TDP worker: తెదేపా కార్యకర్తపై వైకాపా కార్పోరేటర్, అతని అనుచరులు దాడి చేశారు. కడప శంకరాపురానికి చెందిన తెదేపా కార్యకర్త నరసింహ ప్రసాద్ ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అక్కసు తో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీదేవి ఆమె భర్త అతని అనుచరులు దాడి చేశారు. రాత్రి ఇంటికి వెళ్తున్న నరసింహ ప్రసాద్​ను ఆపి వైకాపాకు వ్యతిరేకంగా తెదేపా కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నావంటూ ప్రశ్నించగా.. అతను సమాధానం ఇవ్వకుండా వెళ్లడంతో వెంబడించి కర్ర తీసుకొని తలపై గట్టిగా కొట్టారు. దీంతో తలకి బలమైన గాయమైంది. గాయపడిన నరసింహన ప్రసాద్​ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా తెదేపా నాయకులు ఆయన్ని పరామర్శించి భయపడాల్సిన అవసరం లేదని, తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణం ముద్దాయిల పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.