కడప జిల్లా చిట్వేలు మండలం నక్కలపల్లిలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంలో పురుగులు ఉన్నాయని స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నాణ్యత లేని సరుకు వద్దంటూ ఆందోళన చేశారు. బియ్యం పంపిణీ చేస్తున్న వాహనాన్ని వారు అడ్డుకున్నారు. రేషన్ ద్వారా సన్నరకం బియ్యం అందిస్తామన్న ప్రభుత్వం పురుగుల బియ్యం ఇచ్చిందని.. వాటితో పొట్ట పోసుకునేదెలా అంటూ వాపోయారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేపట్టింది. కానీ ఇలాంటి పురుగులు పట్టిన బియ్యం అందించటం ఎంతవరకు న్యాయమంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న వేళ... ఇలాంటి నాణ్యత లేని బియ్యంతో చేసిన ఆహారం తిని ఇంకా వ్యాధుల బారిన పడాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి.. నాణ్యమైన బియ్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'ప్రతీ ఇంటికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం.. త్వరలో!'