కడపలోని పాత కడపకు చెందిన మేరీ దాదాపు 20 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. అక్కడ నివాసాల్లో పని మనిషిగా ఉంటూ జీవనం కొనసాగించింది. మేరీ భర్త జాన్ మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు వివాహం చేసుకుని వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా 2020లో కరోనా విజృంభించడంతో విదేశాల్లో ఉన్న వారందరూ వారి వారి స్వస్థలాలకు వచ్చారు.
మేరీ కూడా ఆరు నెలల క్రితం కడపకు వచ్చింది. రానైతే వచ్చింది కానీ ఏం చేయాలో తెలియదు. కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆటో నేర్చుకుంది. మూడు లక్షలు రుణం తీసుకొని సొంత ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: కడప ఉక్కు భాగస్వామికి ఆర్థిక కష్టాలు