కడప జిల్లా సింహాద్రిపురంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న తోటలో కలుపు తీస్తుండగా...గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతును తాడుతో బిగించి కిరాతకంగా హత్య చేశారు. ఎన్నికల సమయం కారణంగా గ్రామస్తులు పులివెందుల వైకాపా కార్యాలయనికి వెళ్లారని.. ఆ సయమంలో ఎవరూ ఉండరనే ఉద్దేశంతోనే దుండగులు హత్య చేసి ఉంటారని గ్రామస్తలు భావిస్తున్నారు. ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు.. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. హత్యకు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: