ETV Bharat / state

అంబులెన్స్ వాహన డ్రైవర్ తో వాగ్వాదం.. రోగి మృతి - ambulance driver

woman dead : ఓ వ్యక్తి దూకుడు స్వభావంతో నిండు ప్రాణం బలైెంది. అంబులెన్స్ వస్తే అందులో వ్యక్తి ప్రాణాలు కాపాడాలని దారిస్తాం....కాని ఓ కడప జిల్లాలో వ్యక్తి చేసిన పనికి రోగి ప్రాణమే పోయింది. ఎలా అంటే...!

ambulance
ambulance
author img

By

Published : Nov 19, 2022, 10:53 AM IST

woman dead : అంబులెన్స్, 108 వాహనాలకు దారి ఇవ్వకపోతే పెద్ద నేరంగా పరిగణిస్తారు. అలాంటిది ఓ ద్విచక్ర వాహనదారుడు 108 వాహనాన్ని ఆపి డ్రైవర్ తో వాగ్వాదం పెట్టుకోవడంతో వాహనంలో ఉన్న రోగి మృతి చెందారు. కడపకు చెందిన ఓ మహిళ అనారోగ్య రీత్యా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను 108 వాహనంలో ప్రభుత్వ సరోజన ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.... కడప శివారులోని వైయస్సార్ విగ్రహం సమీపంలోని రింగ్ రోడ్డు వద్దకు రాగానే 108 వాహనము, ద్విచక్ర వాహనం రెండు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం కొద్దిగా దెబ్బతింది. వెంటనే ద్విచక్ర వాహనదారుడు అంబులెన్స్ ఆపి డ్రైవర్​తో వాగ్వాదం పెట్టుకోవడమే కాక అతనిపై దాడి చేసి దాదాపు 15 నిమిషాల పాటు అంబులెన్స్ కదలనివ్వలేదు. రోగి బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని, అంబులెన్స్ డ్రైవర్ రోగిని ఆసుపత్రిలో దించేసి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పినప్పటికీ వినలేదు. అప్పటికే రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. చివరకు 108 వాహన డ్రైవర్ ఎలాగోలాగా రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అరగంటలోపే ఆమె మృతి చెందింది. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లయితే రోగి బ్రతికేదని వైద్యులు చెప్పారు.

అంబులెన్స్ డ్రైవర్​తో వాగ్వాదం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.