కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అతిథిగృహం వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. అనుమానితుల వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దుండగులు అనంతపురం జిల్లావాసులుగా పోలీసులు గుర్తించారు.
బోయినపల్లికి సమీపంలోని బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి నివాసం ఉంది. ఈ నివాసానికి సమీపంలో కొంతమంది అనుమానితులు తిరుగుతుండటాన్ని హైవేలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. వారిలో కొందరు పరారవగా.. ఐదుగురు పట్టుబడ్డారు. అనుమానితులను మన్నూరు పీఎస్‌కు తరలించి పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో వీరంతా ఎందుకున్నారు? అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:
గోదావరి-కావేరి అనుసంధానికి సహకరించాలి: సీఎంతో కేంద్రమంత్రి షెకావత్