పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ప్రజలను ప్రలోభాలకు గురి చేసిందని భాజపా కడప జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. తమకు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. పురపాలక ఎన్నికల్లో అలాంటివి జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రొద్దుటూరులో వాలంటీర్లు, డ్వాక్రా మహిళలను ప్రచారాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. దీనికి అధికారులు అడ్డుకట్ట వేయకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. పోలీసులు సైతం దృష్టిసారించి ఎన్నికల ఉల్లంఘనలను నియంత్రించాలని కోరారు.
ఇదీచదవండి
విభేదాలకు చెక్.. చంద్రబాబుతో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా భేటీ