కరోనాతో కుదేలైన చేనేత రంగాన్ని మరో సమస్య వెంటాడుతోంది. కడప జిల్లా జమ్మలమడుగులో లోవోల్టేజి సమస్య చేనేత కార్మికులను ముప్పుతిప్పలు పెడుతోంది. నాణ్యమైన కరెంటు లేకపోవడంతో మరమగ్గాలపై చీరలు నేయలేకపోతున్నామని వాపోతున్నారు. పోగులు తెగిపోతున్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలుగా లోవోల్టేజి సమస్య వెంటాడుతోందని అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే చీరలకు సంబంధించిన సీజన్ ప్రారంభమైంది. విద్యుత్ సమస్య పరిష్కరిస్తే గతేడాది జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాం. విద్యుత్ సమస్య వల్ల మగ్గం ఆకస్మాత్తుగా ఆగిపోతోంది. దారాలు తెగుతున్నాయి. లో వోల్టేజీ సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి -చేనేత కార్మికులు
ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణా..లారీ, కారు సీజ్.. నలుగురు అరెస్ట్